Viral Video : ట్రంప్ కొత్త ప్రభుత్వంలో రక్షణ కార్యదర్శి.. అప్పుడు గొడ్డ‌లి ఎందుకు విసిరాడు..?

అమెరికాలో ఎన్నికల విజయం తర్వాత ట్రంప్‌ క్యాబినెట్‌పై ఒకదాని తర్వాత ఒకటిగా వార్తలు వస్తున్నాయి.

By Kalasani Durgapraveen
Published on : 15 Nov 2024 1:04 PM IST

Viral Video : ట్రంప్ కొత్త ప్రభుత్వంలో రక్షణ కార్యదర్శి.. అప్పుడు గొడ్డ‌లి ఎందుకు విసిరాడు..?

అమెరికాలో ఎన్నికల విజయం తర్వాత ట్రంప్‌ క్యాబినెట్‌పై ఒకదాని తర్వాత ఒకటిగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల మాజీ సైనికుడు, టీవీ నటుడు పీట్ హెగ్‌సేత్‌ను తన కొత్త ప్రభుత్వంలో రక్షణ కార్యదర్శి (మంత్రి)గా నియమించారు. ఇప్పుడు పీట్ హెగ్‌సేత్ గురించి ఒక వివాదాస్పద వార్త విన‌ప‌డుతుంది. పీట్ హెగ్‌సేత్ ఒకప్పుడు లైవ్ టీవీలో టార్గెట్ వైపు గొడ్డ‌లి విస‌ర‌గా.. అనుకోకుండా అది ఒక వ్యక్తికి తాగింది. ఈ ఘటనకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనుకోకుండా జ‌రిగిన ఈ దాడిలో ఆ వ్య‌క్తి దాదాపు చావు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. డ్రమ్మర్‌పై హెగ్‌సేత్ గొడ్డ‌లి విసిరాడంటూ ఇప్పుడు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే డ్రమ్మర్ బాగానే ఉన్నాడు. ఎటువంటి ప్రాణాంతకమైన ప్రమాదం జరగలేదు. అతను అప్పుడే హెగ్‌సేత్‌పై దావా వేశాడని.. అయితే.. ఈ విషయం గోప్యంగా ఉంచబడింద‌ని.. సంఘటన తర్వాత ఏమి జరిగిందో ఇంకా సమాచారం లేదని నివేదిక‌లు చెబుతున్నాయి. ఈ వీడియోను ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగదారులు వేలాది సార్లు ట్వీట్, రీపోస్ట్ చేసారు. అలాంటి వ్య‌క్తికి కీల‌క శాఖ బాధ్య‌త‌లు ఎలా అప్ప‌గించార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఈ వీడియోతో రాబోయే రోజుల్లో ట్రంప్ కష్టాలు పెరిగే అవకాశం ఉంది.

Next Story