పువ్వులు మంచి సువాసన వెదజల్లుతాయి. సువాసన కారణంగానే చాలా మంది పువ్వులను ఇష్టపడుతూ ఉంటారు. కొందరు మహిళలైతే పువ్వులను తలలో ధరిస్తారు. మల్లెపువ్వులు, గులాబీ, రోజా, కనకాంబ్రాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా పువ్వులనే దేవుడికి పూజ చేసే సమయంలో, పండగల సమయంలో ఇంటి ఆలంకరణకు ఎక్కువగా వాడుతారు. పువ్వులకు, మనుషులకు ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. అయితే సాధారణంగా చాలా పువ్వులు సువాసనను వెదజల్లుతాయి. కాన్నీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే పువ్వు కార్ఫ్స్ ఫ్లవర్ మాత్రం కంపు వాసనను వెదజల్లుతుంది. ఇక ఆ పువ్వు దగ్గరికి వెళ్తే.. మనిషి చనిపోయిన తర్వాత మృతదేహం నుంచి వచ్చే వాసనలా ఆ పువ్వు వాసన ఉంటుంది.
చాలా అరుదుగా ఈ పువ్వు పుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కార్ఫ్స్ ఫ్లవర్ కేవల మూడు సార్లు మాత్రమే పూసింది. మగవాళ్ల ప్రైవేట్ పార్ట్‌లా ఈ పువ్వు ఉంటుందని ఈ పువ్వుకు పెనిస్ ప్లాంట్ అనే పేరును పెట్టారు. చాలా పెద్దగా, పొడవుగా ఉండే.. ఈ పూవ్వు ఈగలు, ఇతర కీటకాలను ఆకర్షిస్తుంది. చాలా తేమ, చాలా వేడిగా ఉండే వెదర్‌లో మాత్రమే ఈ పువ్వు పూస్తుంది. తాజాగా ఈ పువ్వు యూరప్‌లోని నెదర్లాండ్స్‌లో పూసింది. విషయం తెలుసుకున్న స్థానికులు దాన్ని చూడటానికి ఫొటోలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇదివరకు ఈ పువ్వు ఇండోనేషియాలోని జావా ఐలాండ్‌లో పూసింది.