పాక్ రైలు హైజాక్ ఘ‌ట‌న‌.. 100 మందికి పైగా బందీల విడుద‌ల‌.. 13 మంది ఉగ్రవాదులు హతం.. సైనికులు కూడా..

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో రైలును హైజాక్ చేసి పలువురు ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు ఉగ్ర‌వాదులు.

By Medi Samrat
Published on : 12 March 2025 12:15 PM IST

పాక్ రైలు హైజాక్ ఘ‌ట‌న‌.. 100 మందికి పైగా బందీల విడుద‌ల‌.. 13 మంది ఉగ్రవాదులు హతం.. సైనికులు కూడా..

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో రైలును హైజాక్ చేసి పలువురు ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు ఉగ్ర‌వాదులు. ఈ హైజాకింగ్‌ను బలూచ్ తిరుగుబాటుదారులు చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇంకా 100 మంది హైజాకర్ల చెరలో ఉన్నారు. బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు పాకిస్థాన్ భద్రతా దళ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ రెస్క్యూ ఆపరేషన్ గురించి సమాచారాన్ని పంచుకున్నారు. ఇప్పటివరకు 80 మంది బందీలను రక్షించామ‌ని తెల‌ప‌గా.. 104 మంది బందీలను విడుదల చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

మీడియా నివేదికల ప్రకారం.. హైజాక్ చేయబడిన రైలు నుండి 100 మందికి పైగా రక్షించబడ్డారు.

పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ విజయవంతమవుతుంది, ఉగ్రవాదులు అంతం అవుతారని పేర్కొన్నారు.

బలూచిస్థాన్ రైలు హైజాక్ ఘటనలో 16 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ వెల్లడించింది. అయితే అధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య ప్రస్తుతం 13గా ఉంది.

80 మంది ప్రయాణికులను రక్షించినట్లు బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపారు. వీరిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు.

13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని నివేదిక‌లు తెలిపాయి.

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ 30 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు సమాచారం.

జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఉన్న ప్రదేశానికి ఒక కిలోమీటరు దూరంలో పాక్ భద్రతా బలగాలు క్యాంప్ చేస్తున్నాయి.

పాకిస్తాన్ భద్రతా దళాలు అన్ని వైపుల నుండి కిలోమీటర్ల దూరం నుంచి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పాకిస్థాన్ ఆర్మీ జెట్‌లు, గన్ ఫ్లైట్ హెలికాప్టర్లు, అనేక డ్రోన్‌లు ఘటనా స్థలంలో ఉన్నాయి.

జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మజీద్ బ్రిగేడ్ హైజాక్ చేసింది. BLA మజీద్ బ్రిగేడ్ పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తోంది. బందీల విడుదలకు బదులుగా రాజకీయ ఖైదీలు.. తప్పిపోయిన వ్యక్తులను విడుదల చేయాలని BLA డిమాండ్ చేసింది. తమ‌ షరతులు పాటించకపోతే తీవ్ర‌ పరిణామాలు ఉంటాయని మజీద్ బ్రిగేడ్ హెచ్చరించారు.

Next Story