ప్రభుత్వాలు మారుతున్నా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మాత్రం మారడం లేదు. మరోసారి పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి సిద్ధమైంది. పెట్రోలు ధరను లీటర్‌కు 4.53, హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి)పై లీటరుకు 8.14 చొప్పున పెంచుతున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. తాజా ధరల సవరణలో, పెట్రోల్ ధర లీటరుకు PKR 289.41 నుండి PKR 293.94 కు పెరిగింది. అదనంగా, HSD ధర PKR 282.24 నుండి PKR 290.38కి పెంచారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలలో మార్పుల కారణంగా దేశంలో పెట్రోల్-డీజిల్ మార్పులకు కారణమైందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది.
కిరోసిన్, లైట్ డీజిల్ ఆయిల్ (ఎల్‌డిఓ) ధరలను పాక్ ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, హెచ్‌ఎస్‌డి ధరలు వరుసగా బ్యారెల్‌కు సుమారు 4-4.50 డాలర్ల చొప్పున పెరిగాయి. పెట్రోలు ధర PKR 2.50 నుండి PKR 2.80, HSD ధర లీటరుకు PKR 8 నుండి PKR 8.50 వరకు పెరుగుతుందని భావించారు. అనుకున్నట్లే పాక్ ప్రభుత్వం పెట్రోల్-డీజిల్ ధరలను పెంచేసింది.