పాక్ - బంగ్లాదేశ్ దోస్తీ

పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు దోస్తీ కి ముందుకు వచ్చాయి. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ ఆగస్టు 23 నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు.

By Medi Samrat
Published on : 4 Aug 2025 9:18 PM IST

పాక్ - బంగ్లాదేశ్ దోస్తీ

పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు దోస్తీ కి ముందుకు వచ్చాయి. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ ఆగస్టు 23 నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తన పర్యటనలో భాగంగా ఇషాక్ దార్, బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్‌తో పాటు విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్‌తో చర్చలు జరుపుతారు.

మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. గత ఏడాది ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా యూనస్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1971 నాటి విమోచన యుద్ధం, ఆస్తుల పంపకం (4.32 బిలియన్ డాలర్లు), యుద్ధ నేరాలకు పాకిస్థాన్ క్షమాపణ చెప్పాలనే అంశాలపై వివాదాలు ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి ప్రస్తుతం ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి. బంగ్లాదేశ్ కోసం భారత సైన్యం పాక్ తో పోరాడింది. ఎంతో మంది భారతసైనికులు ప్రాణాలు వదిలారు.

Next Story