ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇటీవల పాకిస్థాన్‌లోని బహ్వల్‌పుర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. మసూద్ అజార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను డిమాండ్ చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. మసూద్ అక్కడ ప్రసంగించినట్లు వచ్చిన వార్తలు నిజమైతే.. ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేయడంలో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైనట్లేనన్నారు.
మసూద్ భారత్‌పై ఉగ్రవాదానికి పాల్పడ్డాడని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ కోరుకుంటోందన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు మైనార్టీలపై దాడులు జరగుతుండటంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు.