బెలూచిస్థాన్‌లో కుప్పకూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్

Pakistan Army Helicopter Crashes In Balochistan. పాకిస్థాన్ లోని నైరుతి ప్రాంతంలో ఆదివారం నాడు ఆ దేశ సైనిక హెలికాప్టర్‌ కూలిపోయింది.

By Medi Samrat  Published on  26 Sept 2022 7:45 PM IST
బెలూచిస్థాన్‌లో కుప్పకూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్

పాకిస్థాన్ లోని నైరుతి ప్రాంతంలో ఆదివారం నాడు ఆ దేశ సైనిక హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులతో సహా ఆరుగురు సిబ్బంది మరణించారని సోమవారం నాడు ఆ దేశ మిలటరీ తెలిపింది. బలూచిస్థాన్ ప్రాంతంలోని హర్నాయ్‌కు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిందని మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. 39 ఏళ్ల మేజర్ ఖుర్రం షాజాద్ (పైలట్), 30 ఏళ్ల మేజర్ ముహమ్మద్ మునీబ్ అఫ్జల్ (పైలట్), 44 ఏళ్ల సుబేదార్ అబ్దుల్ వాహిద్, 27 ఏళ్ల సిపాయి ముహమ్మద్ ఇమ్రాన్, 30 ఏళ్ల నాయక్ జలీల్ , 35 ఏళ్ల సిపాయి షోయబ్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో ఉన్నారని డాన్ నివేదించింది.

పాకిస్థాన్ కు చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) బలూచిస్తాన్‌లో జరిగిన ఈ వైమానిక ప్రమాదం కారణంపై ఇంకా సమాచారం అందించలేదని డాన్ నివేదించింది. బెలూచిస్థాన్‌లోని లాస్బెలా ప్రాంతంలో.. ఆగస్టు 1న, కమాండర్ 12 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ సర్ఫరాజ్ అలీతో సహా ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో కమ్యూనికేషన్ కోల్పోయింది. ఒక రోజు తర్వాత, హెలికాప్టర్ యొక్క శిధిలాలు మూసా గోత్‌కు సమీపంలో కనుగొనబడ్డాయి. ఒక్కరు కూడా బ్రతలేదు. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం జరిగిందని ISPR పేర్కొంది.


Next Story