లండన్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా శాంతియుతంగా భారతీయులు నిరసన తెలిపారు. ఆ సందర్భంగా గుమిగూడిన వందలాది మంది నిరసనకారులను ఉద్దేశించి పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారి కొన్ని సంజ్ఞలు చేశారు. గొంతు కోసేస్తామన్నట్లుగా సంజ్ఞ చేయడం ద్వారా వివాదం మరింత ముదిరింది.భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్ పోస్టర్‌ను హోర్డింగ్ లా ఉంచారు కూడా!! పాకిస్తాన్ సైనిక, దౌత్యవేత్తల తీరు మరింత వివాదాస్పదమైంది.
పాకిస్తాన్ అధికారి గొంతు కోసేస్తామంటూ చెబుతున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్పింగ్‌లు వైరల్ అయ్యాయి. అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోలోని అధికారిని పాకిస్తాన్ హైకమిషన్‌లోని డిఫెన్స్ అటాచీ తైమూర్ రహత్‌గా గుర్తించారు.