జైలుకెళ్తాడు.. దేశం విడిచి పారిపోతాడు.. ఇమ్రాన్‌పై జోరుగా ప్ర‌చారం

Pak Ex-PM Imran Khan Charged Under Anti-Terror Act Over Provocative Speech. ఏప్రిల్ నెలలో అధికారం కోల్పోయిన తర్వాత నుండి పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు

By Medi Samrat  Published on  22 Aug 2022 2:15 PM GMT
జైలుకెళ్తాడు.. దేశం విడిచి పారిపోతాడు.. ఇమ్రాన్‌పై జోరుగా ప్ర‌చారం

ఏప్రిల్ నెలలో అధికారం కోల్పోయిన తర్వాత నుండి పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊహించని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ జైలులో మగ్గడం కన్ఫర్మ్ అనే వ్యాఖ్యల నుండి.. అతడు దేశం విడిచి పారిపోవడం కూడా జరగబోతోందనే ప్రచారం సాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులకు కూడా ఊహించని చిక్కులు ఎదురవుతూ వస్తున్నాయి. తాజాగా ఉగ్ర‌వాద చ‌ట్టం కింద ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. దీంతో ముంద‌స్తు బెయిల్ కోసం సోమ‌వారం ఇస్లామాబాద్ హైకోర్టును ఇమ్రాన్ ఆశ్ర‌యించారు.

ఓ ప‌బ్లిక్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. మ‌హిళా జ‌డ్జితో పాటు కొంద‌రు సీనియ‌ర్ పోలీసు అధికారుల‌ను బెదిరించారనే అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం యాంటీ టెర్ర‌రిజం యాక్ట్‌లోని సెక్ష‌న్ 7 కింద ఇమ్రాన్‌పై కేసు న‌మోదు చేశారు. ఇమ్రాన్‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని ఆయ‌న త‌ర‌పున లాయ‌ర్లు బాబ‌ర్ అవాన్, ఫైస‌ల్ చౌద‌రీలు ఇవాళ కోర్టును కోరారు. అధికారంలో ఉన్న పీడీఎం ఇమ్రాన్‌ను కావాల‌నే టార్గెట్ చేసిన‌ట్లు పిటిష‌న్‌లో లాయ‌ర్లు ఆరోపించారు. ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఆయ‌న అభిమానులు భారీ సంఖ్య‌లో ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్నారు.


Next Story