పాకిస్తాన్ దేశంలో పెరుగు కోసం రైలును ఆపిన ఘటన చోటు చేసుకుంది. కహ్నా రైల్వే స్టేషన్ సమీపంలో పెరుగు కొనుగోలు చేయడానికి మార్గంలో రైలును ఆపినందుకు రైలు డ్రైవర్, అతని సహాయకుడిని సస్పెండ్ చేశారు. రైలును ఆపిన తర్వాత డ్రైవర్‌ను ఓ దుకాణంలో పెరుగు కొని.. తిరిగి రైలు ఎక్కాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారడంతో రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ప్రమాదాలు, ప్రయాణికుల భద్రత, ఆదాయం తగ్గడం వంటి వివిధ సమస్యల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న రైల్వే శాఖపై ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ విమర్శలకు తావిచ్చింది. ఆ వెంటనే మంత్రి చర్యలు తీసుకున్నారు. డ్రైవర్ రానా మహ్మద్ షెహజాద్, అతనిని సస్పెండ్ చేయాలని పాకిస్తాన్ రైల్వే లాహోర్ పరిపాలనను ఆదేశించారు. 'భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను సహించబోనని, ఎవరైనా జాతీయ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకునేలా చేయను' అని మంత్రి ఒక ప్రకటనలో హెచ్చరించారు.
అంతకుముందు డిసెంబర్‌లో ప్రయాణ సమయంలో లోకోమోటివ్ డ్రైవర్లు, సహాయకులు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడంపై పాకిస్తాన్ రైల్వే నిషేధం విధించిందని నివేదిక తెలిపింది. వారు అన్ని రైళ్లలో సెల్ఫీలు తీసుకోకుండా, వారి ఫోన్‌లలో వీడియో మరియు ఆడియో సందేశాలను రికార్డ్ చేయకుండా నిషేధించారు. రైలు సిబ్బందిని (ముఖ్యంగా డ్రైవర్లు ,వారి సహాయకులు) ట్రాక్ చేస్తూ ఉండాలని, ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత డివిజనల్ హెడ్‌లు కూడా ఆదేశించారు.