అంతర్జాతీయ వేదిక‌పై పాకిస్థాన్‌కు మరోసారి అవమానం

అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు మరోసారి అవమానం ఎదురైంది.

By -  Medi Samrat
Published on : 26 Sept 2025 6:29 PM IST

అంతర్జాతీయ వేదిక‌పై పాకిస్థాన్‌కు మరోసారి అవమానం

అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు మరోసారి అవమానం ఎదురైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో AI గురించి మాట్లాడుతున్నప్పుడు.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పదేపదే త‌డ‌బ‌డ్డాడు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అధ్యక్షతన జరిగిన AI ఇన్నోవేషన్ డైలాగ్‌లో మాట్లాడుతూ.. ఖవాజా ఆసిఫ్ తన సందేశం కంటే తన ప్రసంగంతో అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. ప్రసంగం సమయంలో కనీసం ఏడు పదాల ఉచ్చారణలో పొరపాటు పడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

AI ఇన్నోవేషన్ డైలాగ్ సమయంలో ఖవాజా ఆసిఫ్ బ్రీత్‌టేకింగ్, రీ షేపింగ్ అవ‌ర్ వ‌ర‌ల్డ్‌ వంటి పదాలు మాట్లాడటంలో పదేపదే తప్పులు చేశాడు. ఇది మాత్రమే కాదు.. పాకిస్తాన్ రక్షణ మంత్రి రిస్క్‌ను రిక్స్ అని పిలిచారు, దీని కారణంగా సమావేశంలో ఉన్న ప్రతినిధులందరూ అసౌకర్యానికి గురయ్యారు. ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఈ పొరపాటు కెమెరాలో బంధించబడింది.

వార్తా సంస్థ ANI సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన‌ క్లిప్‌ను పోస్ట్ చేసింది. దానిపై వినియోగదారులు తమాషా కామెంట్‌లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానిస్తూ ఒక వినియోగదారు రాశారు.. ఆపరేషన్ సిందూర్ అతన్ని కదిలించిందన్నాడు. మరొక వినియోగదారు.. అతను ఒక వాక్యాన్ని కూడా సరిగ్గా మాట్లాడలేడు. హే, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? అని ప్ర‌శ్నించారు.

ఈ తప్పుల తర్వాత కూడా ఖ్వాజా ఆసిఫ్ విశ్వాసం తగ్గలేదు.. అతను యుద్ధంలో AI వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తూనే ఉన్నాడు. ఈ సాంకేతికత సంఘర్షణ సరిహద్దులను చెరిపివేస్తుందని, నిర్ణయం తీసుకునే సమయాన్ని తగ్గిస్తుందని.. దౌత్యపరమైన ఎంపికలను పరిమితం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

రిస్క్ అనే పదాన్ని నొక్కి చెబుతూ, గ్లోబల్ స్టాండర్డ్స్, చట్టపరమైన రక్షణలు లేనప్పుడు.. AI విప్లవం డిజిటల్ విభజనను మరింతగా పెంచే ప్రమాదం ఉందని, కొత్త రకాల డిపెండెన్సీకి దారితీస్తుందని.. శాంతిని లేకుండా చేస్తుంద‌ని ఆయన అన్నారు.

Next Story