కోట్ల విలువ చేసే కార్లను కొనడం కాదు.. ఆ స్థాయి స్పోర్ట్స్ కారును మనం కంట్రోల్ చేయగలమా లేదా అన్నది కూడా గుర్తుంచుకోవాలి. బ్రిటీష్ వ్యక్తి షోరూమ్ నుండి డెలివరీ తీసుకున్నాక.. కేవలం 3 కి.మీ దూరం వచ్చాక.. తన సరికొత్త ఫెరారీకి యాక్సిడెంట్ చేశాడు. డెర్బీషైర్ రోడ్స్ పోలీసింగ్ యూనిట్ యొక్క ట్విట్టర్ ఫీడ్ ప్రకారం.. కారు డెలివరీ షో రూమ్ నుండి కేవలం రెండు మైళ్ల (3.2 కిలోమీటర్లు) దూరం తర్వాత ఫెరారీ క్రాష్ అయినట్లు తెలియజేశారు. ఫెరారీ 488 కారు ధర కోటి రూపాయలు పైనే.. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
సోషల్ మీడియాలో ప్రచురించబడిన ఫోటో ప్రకారం.. 488 యొక్క ఫ్రంట్ భాగం బాగా దెబ్బతిన్నది. కారు టాప్ ఫ్రంట్, బానెట్, హెడ్‌లైట్‌ల చుట్టూ ఉన్న విభాగాలు ధ్వంసమైనట్లు కనిపిస్తున్నాయి. మోడల్ ని బట్టి ఫెరారీ 488 ధర సుమారు రూ. 1.13 కోట్ల నుండి రూ. 2.27 కోట్ల వరకూ ఉంటుంది. ఫెరారీ 488లో 3.9-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 670 PS శక్తిని మరియు 760 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, 7-స్పీడ్ DCTతో జత చేయబడింది. ఫెరారీ 488 కారు 3 సెకన్లలో 0-100 కిమీ/గం చేరగలదు. గరిష్ట వేగం గంటకు 361 కిమీ.కోట్ల విలువైన కారును అలా డెలివరీ తీసుకున్నాడు.. కొన్ని నిమిషాల తర్వాత..!షోరూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత సూపర్ కార్లు క్రాష్ కావడం ఇదే మొదటిసారి కాదు. డ్రైవర్ ఇంతకు ముందు ఎప్పుడూ సూపర్‌కార్‌ని నడపకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.