సౌదీ అరేబియా : 18000 మందికి పైగా అరెస్ట్

సౌదీ అరేబియా (KSA) అధికారులు జనవరి 4 నుండి జనవరి 10 మధ్య అక్రమంగా నివాసం ఉంటున్న 18వేల మందిని

By Medi Samrat  Published on  16 Jan 2024 5:41 PM IST
సౌదీ అరేబియా : 18000 మందికి పైగా అరెస్ట్

సౌదీ అరేబియా (KSA) అధికారులు జనవరి 4 నుండి జనవరి 10 మధ్య అక్రమంగా నివాసం ఉంటున్న 18వేల మందిని అరెస్టు చేశారు. పలు నిబంధనలు ఉల్లంఘించి అక్కడే ఉంటున్న 18,538 మందిని అరెస్టు చేసింది. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అరెస్టయిన వారిలో 11,047 మంది నివాస చట్టాలను ఉల్లంఘించినవారు, 4,299 మంది సరిహద్దు భద్రతా నిబంధనలను, 3,192 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో 5,328 మంది మహిళలు కూడా ఉన్నారు. సౌదీ అరేబియాలోకి చొరబాటుదారులను తీసుకుని వస్తూ పట్టుబడిన వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ శిక్షలో భాగంగా గరిష్టంగా 1 మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా కూడా విధించనున్నారు. ఇక అక్రమాలకు పాల్పడిన వారికి కఠినమైన చర్యలు ఉండనున్నాయి.

Next Story