బుధవారం బార్సిలోనా సమీపంలో రెండు రైళ్లు.. ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 150 మందికి పైగా స్వల్పంగా గాయపడ్డారని స్పెయిన్ అధికారులు తెలిపారు. ఉదయం 8:00 గంటలకు (0700 GMT) కు ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో ఎక్కువ మంది స్వల్పంగా గాయపడ్డారు, ఐదుగురుకు తీవ్ర గాయాలు ఉన్నారు. "బార్సిలోనాకు వెళ్లే లైన్‌లో మోంట్‌కాడా ఐ రీక్సాక్-మన్రేసా స్టేషన్‌లో ఉదయం 7:50 గంటలకు రెండు రైళ్లు ఢీకొన్నాయి.. ఒక రైలు మరొక రైలును వెనుక నుండి ఢీకొంది" అని రైల్ ఆపరేటర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా.. రైళ్లను ఇరు వైపులా ఆపేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. బార్సిలోనాకు ఉత్తరాన 10 కిలోమీటర్ల (ఆరు మైళ్లు) దూరంలో ప్రమాదం జరిగిన ప్రాంతం ఉంది. 18 మెడికల్ యూనిట్లను ఆ ప్రాంతానికి పంపినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.