వేగంగా పాకుతున్న ఒమిక్రాన్‌.. 57 దేశాల్లో కేసులు నమోదు

Omicron variant cases registered in 57 countries. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తిస్తుండటంతో ప్రపంచ దేశాలకు

By అంజి  Published on  8 Dec 2021 4:04 AM
వేగంగా పాకుతున్న ఒమిక్రాన్‌.. 57 దేశాల్లో కేసులు నమోదు

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తిస్తుండటంతో ప్రపంచ దేశాలకు భయాందోళనకు గురవుతున్నాయి. డెల్టా వేరియంట్‌ నుండి బయటపడ్డాం అనుకునే లోపే.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో కరోనా మహమ్మారి కోరలు చాచింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టా వేరియంట్‌ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్‌ ఇప్పటి వరకు 57 దేశాలకు పాకింది. దక్షిణాఫ్రికాలో గత నెల నవంబర్‌లో ఈ వేరియంట్‌ వెలుగు చూసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,701 మంది బాధితులు ఒమిక్రాన్‌ బారిన పడ్డారు.

బ్రిటన్‌లో 437, డెన్మార్క్‌లో 398, దక్షిణాఫ్రికాలో 255, అమెరికాలో 50, జింబాబ్వేలో 50, భారతదేశంలో 23తో పాటు మరికొన్ని దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు ఆయ దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే విమాన ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల లాక్‌డౌన్‌ విధించగా.. కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించాలన్న ఆలోచనలో పడ్డాయి. భారత్‌లో కూడా క్రమంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 23 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో విదేశాల నుండి వస్తున్న ప్రయాణికులకు కరోనా నిర్దారణ పరీక్షలను పటిష్టం చేసింది. భారత్‌లో 20కి పైగా ఓమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ కేసులు నమోదవుతున్నందున అనేక రాష్ట్రాలు టీకా, నిఘా మరియు నియంత్రణ చర్యలను వేగవంతం చేశాయి. కొత్త వేరియంట్‌పై పెరుగుతున్న ఆందోళనల మధ్య, పార్లమెంటరీ కమిటీ కోవిడ్ వ్యాక్సిన్‌ల సామర్థ్యాన్ని తప్పనిసరిగా మూల్యాంకనం చేయాలని మరియు కొత్త స్ట్రెయిన్ డెవలప్‌మెంట్ ఇమ్యునోస్కేప్ మెకానిజంకు సంబంధించిన ఆందోళనలను విమర్శనాత్మకంగా పరిష్కరించాలని సిఫార్సు చేసింది.

Next Story