భయం.. భయం.. 46 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌..!

Omicron variant cases have been reported in 46 countries. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన

By అంజి  Published on  6 Dec 2021 10:34 AM IST
భయం.. భయం.. 46 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌..!

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఈ వేరియంట్‌ 46 దేశాలకు విస్తరించింది. ఇప్పుడిప్పుడే డెల్టా వేరియంట్‌ నుండి కోలుకుంటున్న ప్రపంచ దేశాలకు.. తాజా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్‌ 6 రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోందని నివేదికలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారి సంఖ్య 941కి చేరింది.

బ్రిటన్‌లో 246 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే దక్షిణాఫ్రికాలో 228, జింబాబ్వేలో 50, అమెరికాలో 39 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 21కి చేరింది. ఆదివారం నాడు 17 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ప్రభుత్వం నడుం బిగించింది. ఒమిక్రాన్‌పై మరింత దృష్టి పెట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. ఇదిలా ఉంటే ఆఫ్రికా దేశాల నుండి భారత్‌కు వచ్చిన వారిలో చాలా మంది ఆచూకీ లభించడం లేదు. పాస్‌పోర్టుల్లో పేర్కొన్న అడ్రస్‌లలో వారు ఉండకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరికైనా ఒమిక్రాన్‌ సోకితే.. అది స్థానికంగా వ్యాపించే ముప్పు ఉంది. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులో విదేశాల నుండి వచ్చే ప్రయాణికులపై అధికారులు నిబంధనలు కఠినతరం చేస్తున్నారు.

Next Story