ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. కొత్త కొత్త వేరియంట్లతో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలు రకాల వేరియంట్లు ప్రజలను అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతుండగా.. తాజాగా దాని సబ్ వేరియంట్‌ను పరిశోధకులు గుర్తించారు. బ్రిటన్‌లో ఓమిక్రాన్ సబ్ స్ట్రెయిన్ వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్‌ను అండర్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో ఉంచి హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. పలు రకాల పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే ఈ వేరింట్ భారత్, డెన్మార్క్ సహా 40 దేశాలకు వ్యాపించింది. మొదటగా ఈ వేరియంట్‌ను డిసెంబర్‌లో గుర్తించారు. ఇది వేగంగా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా 426 కేసులను గుర్తించారు.
ఓమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ప్రత్యేక ఉత్పరివర్తనాన్ని కలిగి ఉంది. అయితే బీఏ. 2 వేరియంట్‌లో అలాంటి లక్షణాలు లేకపోగా.. ఆర్టీపీసీఆర్ పరీక్షలో మాత్రం వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వేరియంట్‌ను సీక్రెట్ ఓమిక్రాన్ అని పిలుస్తున్నారు. కొత్త వేరియంట్‌తో భారీగా కేసులు పెరగొచ్చని పరిశోధకులు అంటున్నారు. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ యూరప్‌తో పాటు ఉత్తర అమెరికా అంతటా వ్యాపించే ఛాన్స్ ఉందని జాన్స్ హాపికిన్స్‌లోని వైరాలజిస్టు బ్రియాన్ జెల్లీ అంచనా వేశారు. హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం.. డెన్మార్క్‌లో 45 శాతం కొత్త వేరియంట్ కేసులు నమోదు అవుతుండవచ్చని పేర్కొంది.