38 దేశాలకు పాకిన 'ఓమిక్రాన్'.. ప్రపంచ దేశాలు అలర్ట్.!
Omicron Spreads To 38 Nations, Says WHO. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలకు పాకుతోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్
By అంజి Published on 4 Dec 2021 11:52 AM ISTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలకు పాకుతోంది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ బయట పడింది. ఒమిక్రాన్ కేసులు ఇప్పటి వరకు 38 దేశాల్లో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే వేరియంట్ వల్ల ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకరమే అని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణాలు సంభవించలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ హెడ్ మారియా వాన్ ఖేర్‌కోవ్ నివేదిక ఇచ్చారు.
వేరియంట్ వేగం, అది మరింత తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందా, దానికి వ్యతిరేకంగా చికిత్సలు, టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కొత్త వేరియంట్ యొక్క వ్యాప్తి రాబోయే కొద్ది నెలల్లో యూరప్‌లోని సగానికి పైగా కోవిడ్ కేసులకు కారణమవుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. డెల్టా స్ట్రెయిన్ మాదిరిగానే కొత్త వేరియంట్ కూడా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ మందగించగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ క్రిస్టాలినా జార్జివా శుక్రవారం తెలిపారు.
దక్షిణాఫ్రికాలోని పరిశోధకుల ప్రాథమిక అధ్యయనంలో ఒమిక్రాన్ వేరియంట్ నవంబర్ 24న మొదటిసారిగా కనుగొనబడింది. డెల్టా లేదా బీటా జాతులతో పోలిస్తే ఇది రీఇన్‌ఫెక్షన్‌లకు కారణమయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని సూచిస్తోంది. ఒమిక్రాన్ ఆవిర్భావం అసమాన ప్రపంచ వ్యాక్సినేషన్ రేట్ల ప్రమాదానికి "అంతిమ సాక్ష్యం" అని రెడ్ క్రాస్ హెడ్ ఫ్రాన్సిస్కా రోకా చెప్పారు. ఒమిక్రాన్ కేసులు 38 దేశాల్లో నమోదు కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. చాలా వేగంగా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.