అమెరికా పోలీసులు చేసిన పని.. తీవ్ర విమర్శలు

Ohio police probed after man screaming 'I'm paraplegic' dragged from car. అమెరికాలో పోలీసుల దూకుడు చర్యల గురించి ఎన్నో ఏళ్లుగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ

By Medi Samrat  Published on  13 Oct 2021 11:15 AM GMT
అమెరికా పోలీసులు చేసిన పని.. తీవ్ర విమర్శలు

అమెరికాలో పోలీసుల దూకుడు చర్యల గురించి ఎన్నో ఏళ్లుగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా నల్లజాతీయులపై వారి దాడులు ఎంతో తీవ్రంగా ఉన్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ ఘటన ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు అమెరికా పోలీసులు. ఇప్పుడు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. తనకు పక్షవాతం ఉందని.. కారు దిగలేనని చెప్పినా వినకుండా.. పోలీసులు ఓ నల్లజాతీయుడిని జుట్టు పట్టి లాగి కిందకు ఈడ్చేశారు. ఒహాయో రాష్ట్రంలోని డేటన్ లో గత నెల 30న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. క్లిఫర్డ్ ఒవెన్స్ బై (39) అనే నల్లజాతీయుడు తన కార్ లో ఇంటికి వెళ్తుండగా డేటన్ పోలీసులు ఆపారు. డ్రగ్స్ తనిఖీలు చేయాలని, కారు దిగాలని పోలీసులు క్లిఫర్డ్ ను ఆదేశించారు.

అయితే, అందుకు నిరాకరించిన క్లిఫర్డ్.. తనకు పక్షవాతం ఉందని, కారు దిగలేనని చెప్పాడు. తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. అతడి మాటలను ఏ మాత్రం పట్టించుకోని పోలీసులు.. పదే పదే కారు దిగాలని ఒత్తిడి తెచ్చారు. సహనం కోల్పోయిన పోలీసులు అతడిని జుట్టు పట్టి బయటకు లాగేశారు. కిందపడేసి చేతులు కట్టేశారు. తర్వాత కారును చెక్ చేశారు. ఈ ఘటన మొత్తం పోలీసుల బాడీ క్యామ్ లో రికార్డ్ అయింది. తమ తనిఖీల్లో 22,450 డాలర్ల సొమ్ము తప్ప డ్రగ్స్ ఏవీ దొరకలేదని పోలీసులు చెప్పారు. పోలీసుల తీరుపై మరోసారి విమర్శలు రావడంతో అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.


Next Story