ప్రధానికే ఫైన్.. ఆ రూల్స్ బ్రేక్ చేసినందుకే..

Norway PM fined by police over Covid-19 rules violation. చట్టాలను క‌ఠి‌నంగా అమ‌లుప‌రిచే దేశాల‌లో నార్వే ముందు వ‌రుస‌లో ఉంటుంది.

By Medi Samrat  Published on  9 April 2021 1:57 PM GMT
ప్రధానికే ఫైన్.. ఆ రూల్స్ బ్రేక్ చేసినందుకే..
చట్టాలను క‌ఠి‌నంగా అమ‌లుప‌రిచే దేశాల‌లో నార్వే ముందు వ‌రుస‌లో ఉంటుంది. అక్క‌డ చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించబోరు. అదే విష‌యాన్ని నార్వే పోలీసులు తాజాగా స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఏకంగా దేశ ప్రధానికే జరిమానా విధించారు అక్క‌డి పోలీసులు.


వివరాళ్లోకెళితే.. కరోనా వైరస్ విజృంభిస్తుండంతో నార్వే ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అయితే.. బహిరంగ సభలు, పార్టీలపై నిషేధం విధించారు. ఏదైనా కార్యక్రమానికి 10 మంది కంటే ఎక్కువ అతిధులు హాజరు కావొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలను సాక్షాత్తూ.. ఆ దేశ ప్రధాని ఎర్నా సోల్బర్గ్ అతిక్రమించారు.

ఎర్నా సోల్బర్గ్ 60వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. 13 మంది కుటుంబ సభ్యులతో కలసి ఫిబ్రవరిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దీంతో అమె వైఖరిపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్ర‌ధాని.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. దీనిపై దృష్టిసారించిన పోలీసులు విచార‌ణ అనంత‌రం ఆమెకు దాదాపు రూ.1.75లక్షల ఫైన్ విధించారు. త‌ప్పు చేస్తే చ‌ట్టం దృష్టిలో ఎంత పెద్ద వారైనా ఒక‌టే అని నిరూపించిన ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.




Next Story