11 రోజుల పాటూ నవ్వడానికి వీలు లేదు.. నవ్వారని తెలిస్తే చంపేస్తారు

North Korea Bans People From Laughing for 11 days. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వింత నిర్ణయాల గురించి మనందరం విన్నాం.

By Medi Samrat  Published on  17 Dec 2021 10:58 AM IST
11 రోజుల పాటూ నవ్వడానికి వీలు లేదు.. నవ్వారని తెలిస్తే చంపేస్తారు

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వింత నిర్ణయాల గురించి మనందరం విన్నాం. ఇప్పుడు మరో నిర్ణయం గురించి ప్రపంచం మొత్తం చర్చిస్తూ ఉంది. ఇకపై ఉత్తర కొరియాలో 11 రోజుల పాటు నవ్వడాన్ని నిషేధించనున్నారు. ప్రజలు సంబరాలు చేసుకుంటూ, నవ్వుతూ కనిపిస్తే కఠినంగా శిక్షిస్తారు. మాజీ నేత, ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్-ఇల్ 10వ వర్ధంతి సందర్భంగా నవ్వడాన్ని ప్రభుత్వం నిషేధించింది. కిమ్ జోంగ్-ఇల్ వర్ధంతి సందర్భంగా దేశంలో ఎవరూ 11 రోజుల పాటు ఎటువంటి సంబరాలను జరుపుకోలేరు. ఇది జాతీయ సంతాప దినం కాబట్టి, ప్రజలు నవ్వడం, మద్యం సేవించడంపై నిషేధం విధించబడుతుంది.

డిసెంబర్ 17న ప్రజలు కిరాణా సామాను కొనడానికి కూడా అనుమతించరు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ సంతాప దినం సందర్భంగా ఎవరైనా మద్యం సేవించి లేదా మత్తులో పట్టుబడితే, ఆ వ్యక్తి తిరిగి రాలేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో, జాతీయ సంతాప సమయంలో ఇంట్లో ఎవరైనా చనిపోతే, కుటుంబం బిగ్గరగా ఏడవడానికి అనుమతించబడదని కూడా తేల్చి చెప్పారు. ఈ సమయంలో పుట్టినరోజులు, ఇతర వేడుకలను జరుపుకోవడానికి అనుమతించబడదు. ఆదేశాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేస్తారు. అరెస్టయిన వ్యక్తులపై కఠిన శిక్షలు ఉంటాయని అంటున్నారు. ఈ సమయంలో పోలీసులు ప్రజలపై నిఘా ఉంచారు.

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తన వింత నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. నియంత కిమ్ జాంగ్ ఉన్ తనకు ఇష్టమైన లెదర్ కోట్‌ను కాపీ కొట్టకూడదని మండిపడ్డారుతెలిపాడు. ఇప్పుడు దేశంలో లెదర్ కోట్‌ల అమ్మకాన్ని, ధరించడాన్ని నిషేధించాడు. నిబంధనల ప్రకారం, ఉత్తర కొరియాలో ఎవరూ లెదర్ కోట్‌ను విక్రయించలేరు, ధరించలేరు. ఏది ఏమైనా నియంతృత్వ పోకడకు ఓ లిమిట్ అంటూ ఉంటుందని ప్రపంచ దేశాల ప్రజలు చెబుతూ ఉన్నారు.


Next Story