కరోనా వ్యాక్సిన్‌కు చెక్ పెట్టేందుకు రకరకాల వ్యాక్సిన్లు రాబోతున్నాయి.. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి. తొలిదశలో కోవిడ్ వ్యాక్సిన్ కరోనా వారియర్స్‌కు ఇవ్వనున్నారు.. ఆ తర్వాత దపదపాలుగా వివిధ ఏజ్ గ్రూప్‌ల వారికి ఇవ్వనున్నారు. ఇదే సమయంలో మందు బాబులకు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది కోవిడ్ వ్యాక్సిన్.
అది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండు నెలల పాటు ఎలాంటి మద్యపానాన్ని తీసుకోరాదట.ఈ విషయాన్ని రష్యా అధికారులు హెచ్చరిస్తున్నారు.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు నెలల పాటు మద్యపానానికి దూరంగా ఉండాలని తమ దేశ పౌరులను హెచ్చరిస్తున్నారు అధికారులు.
స్పుత్నిక్ వి కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రభావవంతం కావడానికి 42 రోజులు రష్యన్లు అదనపు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని రష్యా ఉప ప్రధాని టటియానా గోలికోవా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వార్త అత్యధికంగా మద్యం తాగే దేశాలకు మింగుడు పడని వార్తే అంటున్నారు.