విమానం కూలి 19 మంది దుర్మ‌ర‌ణం

Nineteen people killed and three injured after Russian aircraft crashes. రష్యాలో ఘోర‌ప్ర‌మాదం చోటుచేసుకుంది. విమానం కూలడంతో ఘోర‌ప్ర‌మాదం

By Medi Samrat
Published on : 10 Oct 2021 1:41 PM IST

విమానం కూలి 19 మంది దుర్మ‌ర‌ణం

రష్యాలో ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది. విమానం కూలడంతో ఘోర‌ప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో విమానంలో ప్ర‌యాణిస్తున్న‌ పారాట్రూపర్‌ల బృందం చనిపోయినట్లు భావిస్తున్నారు. దేశానికి తూర్పున ఉన్న‌ టాటర్‌స్తాన్‌లో ఈ విమాన ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యన్‌ మీడియా పేర్కొంది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు విమానంలో 23 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో 19 మంది చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారని ఇంటర్‌ఫాక్స్ నివేదించింది.


అయితే మృతుల సంఖ్య ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. విమానం నుండి ఏడుగురిని సజీవంగా వెలికితీసిన‌ట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ప్ర‌స్తుతం వారు ఎక్క‌డున్నారు.. మిగిలిన 16 మంది ప‌రిస్థితి ఏంటి అనే విష‌యం ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించ‌లేదు.34 ఏళ్లుగా స‌ర్వీసులో ఉన్న ఈ విమానం మెంజెలిన్స్కీ ఫ్లయింగ్ క్లబ్‌లో పారాట్రూపర్‌ల శిక్షణ కోసం ఉపయోగించారు. టేకాఫ్ అయిన వెంటనే విమానం క్రాష్ అయ్యిందని.. చెట్ల మీద తక్కువ ఎత్తులొ ఎగురుతున్నట్లు ప్ర‌త్య‌క్ష‌ సాక్షి చెప్పాడు.




Next Story