అమెరికాలో గన్ కల్చర్‌లో ఏ మాత్రం మార్పు లేదు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం మూడు అమెరికన్ నగరాల్లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. మరో రెండు డజన్ల మంది గాయపడ్డారు. యునైటెడ్ స్టేట్స్‌ను కాల్పుల ఘటనలు గడగడలాడిస్తూనే ఉన్నాయి. ఫిలడెల్ఫియాలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. రద్దీగా ఉండే బార్ అండ్ రెస్టారెంట్ లో గొడవ జరగడంతో 12 మంది గాయపడ్డారు. ప్రజలు భయాందోళనలకు గురై పారిపోవడానికి ప్రయత్నించారు.
శనివారం అర్ధరాత్రి తర్వాత టెన్నెస్సీలోని చట్టనూగాలోని ఒక బార్ సమీపంలో అర్ధరాత్రి తర్వాత కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు మరణించారు. 14 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన మరో కాల్పుల్లో, మిచిగాన్‌లోని సాగినావ్‌లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. మిచిగాన్ కాల్పుల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ సంఘటనలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు కాల్పుల ఘటనలకు సంబంధించిన అనుమానితులు కస్టడీలో ఉన్నట్లు సమాచారం లేదు.