పొంచి ఉన్న మ‌రో ముప్పు.. మెద‌డును తినే అమీబా.. అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం అన్న శాస్త్ర‌వేత్త‌లు

New study reveals cases of deadly 'brain-eating amoeba' are rising in US. క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌పంచం ఇంకా కోలుకోలేదు.

By Medi Samrat  Published on  23 Dec 2020 1:45 PM GMT
పొంచి ఉన్న మ‌రో ముప్పు.. మెద‌డును తినే అమీబా.. అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం అన్న శాస్త్ర‌వేత్త‌లు

క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌పంచం ఇంకా కోలుకోలేదు. దాదాపు అన్ని దేశాల్లో ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే దీని బారిన ప‌డి ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్షల్లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌హ‌మ్మారికి ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ రాక‌మునుపే మ‌రో సూక్ష్మ జీవి ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుంది. అమీబా జాతీకి చెందిన ఈ సూక్ష్మ‌జీవి నేరుగా మ‌నిషి మెద‌డుపై దాడి చేసి చంపేస్తోంది. 'నెగ్లెరియా ఫోవ్లేరీ'గా పిలుస్తున్న ఈ జీవి అమెరికా, ఇత‌ర దేశాల్లోని ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

సెప్టెంబ‌ర్ 8న టెక్సాస్‌లోని హ్యుస్ట‌న్ న‌గ‌రం స‌మీపంలోని ఓ ఆరేళ్ల బాలుడు విప‌రీత‌మైన త‌ల‌నొప్పి, వాంతులు త‌దిత‌ర ల‌క్ష‌ణాల‌తో మృతి చెందాడు. ఆ బాలుడికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. అమీబా కార‌ణ‌మ‌ని తేలింది. దీంతో టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా అక్క‌డి అధికారులు విప‌త్తు ప్ర‌క‌ట‌న జారీ చేశారు. చాలాకాలం పాటు ప్రచారంలో లేని ఈ వ్యాధి.. ద‌క్షిణ అమెరికాలో మాత్ర‌మే ప్ర‌భావం చూపించేది. ప్ర‌స్తుతం క్ర‌మంగా ఉత్త‌ర అమెరికా అంతటా వ్యాపిస్తుంద‌న్న పుకార్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

దీనిపై విశ్లేషిస్తున్న సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌(సీడీసీ).. వాతావ‌ర‌ణ మార్పులే ఇందుకు కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించారు. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా ప్రాణాంత‌క‌మైన మెదుడు తినే అమీబా క్ర‌మ క్ర‌మంగా మ‌నిషి శ‌రీరంలోకి విస్త‌రిస్తున్న‌ట్లు తేలింది. కాగా.. ఇది నాసిర‌క పొర‌ల ద్వారా మ‌నిషి శ‌రీరంలోకి ప్ర‌వేశించి మెద‌డులోకి చొచ్చుకుపోతుంది. మ‌నిషిలో విప‌రీత‌మైన త‌ల‌నొప్పి, వాంతులు, మెడ ప‌ట్టేయ‌డంతో పాటు చిరాకు, అల‌స‌ట‌, మైకం, గంద‌ర‌గోళం, మ‌తిమ‌రుపు, భ‌యం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని నిపుణులు తెలిపారు. వ్య‌క్తి శ‌రీరంలో అమీబా ఉనికిని గుర్తించ‌డానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌రీక్ష‌లు రూపొందించ‌బడ‌లేదు. దీంతో వ్యాధి నిర్థారించేందుకు ఎక్కువ రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

అమీబా సూక్ష్మ‌జీవులు సాధార‌ణంగా కాలువ‌లు, చిన్న చిన్న మురికి గుంట‌లు, అప‌రిశుభ్రంగా ఉండే ప్రాంతాలు, తాగునీటి కుళాయిలు త‌దిత‌ర ప్రాంతాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అంతేకాకుండా ఇవి వెచ్చని మంచినీరు, మ‌ట్టిలో కూడా నివ‌సిస్తున్న‌ట్లు ఎమ‌ర్జింగ్ ఇన్ఫెక్లియోస్ డిసీజెస్ నివేదిక‌లో పేర్కొంది.


Next Story