ఇదెక్కడి సెక్స్ ఎడ్యుకేషన్.. మరీ ఐదో క్లాస్ పిల్లలకు కండోమ్స్..!

New CPS program puts free condoms in nearly every school. సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైన అంశం.. పిల్లలకు కాస్త తెలివి వచ్చాక వారిలో

By Medi Samrat  Published on  12 July 2021 8:38 AM GMT
ఇదెక్కడి సెక్స్ ఎడ్యుకేషన్.. మరీ ఐదో క్లాస్ పిల్లలకు కండోమ్స్..!
సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైన అంశం.. పిల్లలకు కాస్త తెలివి వచ్చాక వారిలో వస్తున్న మార్పులు, ఫీలింగ్స్ వంటి వాటిపై సరైన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అందుకే ఓ వయసు వచ్చాక పిల్లలకు పాఠ్యాంశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబుతూ ఉంటారు. అయితే కొన్ని దేశాల్లో ఇదేదో పాపం అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. విద్యార్థులు ఓ వయసులోకి వచ్చాక సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు చెప్పించడం చాలా కామన్ అయ్యాయి..! కానీ తక్కువ తరగతి చదువుతున్న విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు చెప్పించడాన్ని కొందరు తప్పుబడుతూ ఉన్నారు.


అమెరికాలోని చికాగో పబ్లిక్ స్కూల్స్‌కు చెందిన ఎడ్యుకేషన్ బోర్డు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదో తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు స్కూళ్లలో 'కండోమ్స్'ను అందుబాటులో ఉంచాలని బోర్డు నిర్ణయించింది. బోర్డు పరిధిలో 600 స్కూళ్లు ఉన్నాయి. చికాగో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో స్కూళ్లకు కండోమ్స్‌ను సప్లై చేయనున్నారు. కండోమ్స్ అయిపోతే స్కూల్ ప్రిన్సిపాల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌కు సమాచారమిచ్చి తెప్పించుకోవాల్సి ఉంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపింది.దీని ప్రకారం ఎలిమెంటరీ స్కూళ్లలో 250 వరకు,హైస్కూళ్లలో వెయ్యి వరకు కండోమ్స్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. పూర్తిగా ఉచితంగా వీటిని అందించడం ద్వారా విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు,అవాంఛిత గర్భాలను నిరోధించవచ్చని సీపీఎస్(చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచి వారికి సరైన జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. ఆరోగ్యకర నిర్ణయాలు తీసుకునేందుకు కచ్చితమైన,స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కు యువతకు ఉందన్నారు.

ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులకు దీనిపై అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా బోర్డుకు లేదా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని. దీనిపై పునరాలోచన చేయాలని పలువురు కోరుతూ ఉన్నారు.


Next Story