యూకే స్ట్రెయిన్‌.. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్.. టెన్షన్ తప్పదు..!

New Covid strain in South Africa may 'escape' immune system, warn researchers. యూకేలో గతేడాది వెలుగు చూసిన కరోనా వైరస్

By Medi Samrat  Published on  23 Jan 2021 12:36 PM GMT
యూకే స్ట్రెయిన్‌.. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్.. టెన్షన్ తప్పదు..!
యూకేలో గతేడాది వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయన్‌ ఇప్పటికే ప్రపంచాన్ని టెన్షన్ పెడుతూ ఉంది. కరోనా కొత్త వైరస్ గురించి దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. గత వైరస్‌తో పోలిస్తే ఈ కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. మరింత ప్రాణాంతకంగా ఉందని అన్నారు. కొత్త స్ట్రెయిన్ తర్వాత మరణాల రేటు పెరిగినట్టు ప్రాథమికంగా తేలిందన్నారు. అయితే అందుబాటులోకి వచ్చిన ఫైజర్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాలు అన్ని రకాల కరోనా వైరస్‌లపై సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పారు. పాత వైరస్‌ సోకిన ప్రతి వెయ్యి మందిలో 10 మంది చనిపోతే, ఈ కొత్త వైరస్ కారణంగా 13 మంది చనిపోయారని అంటున్నారు.


దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ గురించి టెన్షన్ పెట్టే విషయాలు ఓ అధ్యయనంలో బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా రకం కరోనా యాంటీబాడీల నుంచి కూడా తప్పించుకుంటుందని.. ఓసారి కరోనా సోకిన వ్యక్తికి మళ్లీ సోకే అవకాశాలు దక్షిణాఫ్రికా కరోనా వల్ల అధికంగా ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. జన్యు మార్పులకు లోనైన కరోనా వైరస్ రకాలు మొదటితరం కరోనాతో పోల్చితే అధిక వేగంతో వ్యాప్తి చెందుతున్నాయి. వీటిల్లో దక్షిణాప్రికా రకం కరోనా క్రిములు సంక్లిష్టమైనవని, ఓసారి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని కూడా మళ్లీ కరోనా బారినపడేలా చేయగలవని ఈ అధ్యయనంలో తెలుసుకున్నారు. ఈ దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కరోనా వ్యాక్సిన్ పనితీరు పైనా ప్రభావితం చూపుతుందని పరిశోధకులు అంటున్నారు. దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ కు 501Y.V2గా నామకరణం చేశారు. ఇది మొదటగా దక్షిణాఫ్రికాలోని ఈస్ట్రన్ కేప్ ప్రావిన్స్ నెల్సన్ మండేలా బే ఏరియాలో ఉనికిని చాటుకుంది. ఈ నూతన రకం స్ట్రెయిన్ లో ఉండే స్పైక్ ప్రొటీన్ జన్యు ఉత్పరివర్తనాలను కలిగివుండడం వల్ల, వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు వెల్లడించారు.


Next Story