టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలి

షార్ట్-వీడియో యాప్‌పై క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ శుక్రవారం దేశంలోని ఇంటర్నెట్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది

By Medi Samrat  Published on  6 Sep 2024 2:00 PM GMT
టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలి

షార్ట్-వీడియో యాప్‌పై క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ శుక్రవారం దేశంలోని ఇంటర్నెట్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. "తదుపరి నోటీసు వచ్చేవరకు టిక్‌టాక్‌పై ఉన్న పరిమితులను తొలగించమని సంబంధిత ఇంటర్నెట్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లందరికీ అథారిటీ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్‌లో విధించిన టిక్‌టాక్ నిషేధాన్ని ఎత్తివేయాలని నేపాల్ క్యాబినెట్ ఆగస్టు 22న నిర్ణయించినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

"నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ నుండి ఆదేశాలు అందిన వెంటనే మేము నిషేధాన్ని ఎత్తివేసాము" అని నేపాల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధీర్ పరాజులి అన్నారు. నేపాల్‌లో యాప్‌ను వాడే స‌మ‌యంలో కొన్ని షరతులను విధిస్తామ‌ని నిషేధాన్ని ఎత్తివేసేటప్పుడు క్యాబినెట్ TikTokని కోరింది. నేపాల్‌లో టూరిజం ప్రమోషన్‌కు సహకరించాలని, డిజిటల్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పెట్టుబడులు పెట్టాలని, పబ్లిక్ ఎడ్యుకేషన్ నాణ్యతను అప్‌గ్రేడ్ చేయాలని.. యాప్‌లోని భాషను ఉపయోగిస్తున్నప్పుడు సున్నితంగా ఉండాలని టిక్‌టాక్‌ని కోరింది.

Next Story