నాలుగు సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ లో అడుగుపెట్టిన నవాజ్ షరీఫ్

మూడుసార్లు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ తిరిగి పాకిస్థాన్ లో అడుగుపెట్టాడు.

By Medi Samrat  Published on  21 Oct 2023 3:15 PM GMT
నాలుగు సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ లో అడుగుపెట్టిన నవాజ్ షరీఫ్

మూడుసార్లు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ తిరిగి పాకిస్థాన్ లో అడుగుపెట్టాడు. నాలుగు సంవత్సరాల తర్వాత పాక్ కు తిరిగి వచ్చాడు. పాకిస్థాన్ లో 2024 సంవత్సరం జనవరిలో జరగనున్నాయి. ప్రస్తుతం ఆ దేశానికి అపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని నవాజ్ భావిస్తూ ఉన్నారు. నాలుగేళ్లుగా యూకేలో అజ్ఞాతవాసంలో ఉన్నాడు పాకిస్తాన్ ముస్లిం లీగ్ చీఫ్ నవాజ్. గత కొన్ని రోజులుగా దుబాయ్ లో ఉన్న షరీఫ్, అక్కడ నుంచి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి చేరుకున్నాడు. అక్కడి నుండి లాహోర్‌కి చేరుకోనున్నాడు.

73 ఏళ్ల నవాజ్ కొంతమంది కుటుంబ సభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు, స్నేహితులతో కలిసి ఉమ్మీద్-ఎ-పాకిస్తాన్ అనే చార్టర్డ్ ఫ్లైట్‌లో దుబాయ్ నుండి ఇస్లామాబాద్‌కు చేరుకున్నాడు. కోర్టు కేసులకు భయపడి నవాజ్ ఇన్నాళ్లూ విదేశాలలో తలదాచుకున్నాడు. అక్టోబరు 19న ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో షరీఫ్ ఎట్టకేలకు పాకిస్థాన్ కు చేరుకున్నాడు. ఇక పాకిస్థాన్ ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటోంది.

Next Story