అంగార‌కుడిపై నీటి జాడ‌లు..

NASA's Mars orbiter finds water flowed on Red Planet longer than thought. మార్స్‌పై నీటి జాడ‌లు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు నాసా ప్ర‌యోగాలు చేస్తోంది.

By Medi Samrat  Published on  29 Jan 2022 12:41 PM GMT
అంగార‌కుడిపై నీటి జాడ‌లు..

మార్స్‌పై నీటి జాడ‌లు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు నాసా ప్ర‌యోగాలు చేస్తోంది. ప్ర‌స్తుతం అంగార‌కుడిపై పరిశోధ‌న‌లు చేస్తున్న మార్స్ రికనైసెన్స్ ఆర్బిటార్ (ఎంఆర్ఓ) కీల‌క విష‌యాల‌ను తెలియ‌జేసింది. మార్స్‌పై నీటి జాడ‌లు ఉన్న‌ట్టు గుర్తించింది. సుమారు రెండు వంద‌ల కోట్ల సంవ‌త్స‌రాల క్రితం నీరు ప్ర‌వ‌హించి ఉంటుంద‌ని తెలియ‌జేసింది. నీరు ఆవిరైపోగా మిగిలిన క్లోరైడ్ సాల్ట్‌పై ఎమ్ఆర్‌వో ప‌రిశోధ‌న‌లు చేసింది. దీనికి సంబంధించిన వివారాల‌ను నాసా ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఉప్పునిల్వ‌లు ఉన్న ప్రాంతాల్లో నీటి కుంట‌లు ఉండేవ‌ని నాసా తెలిపింది.

అంగార‌కుడిపై పరిశోధ‌న‌లకు 2006లో నాసా పంపిన మార్స్ రికనైసెన్స్ ఆర్బిటార్ తాజాగా కీలక సమాచారం అందజేసింది. ఆ నీరు ఆవిరైపోగా మిగిలిన క్లోరైడ్ సాల్ట్‌పై ఎమ్ఆర్‌వో ప‌రిశోధ‌న‌లు చేసింది. దీనికి సంబంధించిన వివారాల‌ను నాసా ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. కాంపాక్ట్ రికనైసెన్స్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ ఫర్ మార్స్ (CRISM) ఉప్పు నిక్షేపాలకు సంబంధించి తీసిన డజన్ల కొద్దీ చిత్రాలను అధ్యయనం చేయడానికి 'క్రేటర్ కౌంటింగ్' పద్ధతిని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. కొత్త ఫలితాలు అంగారకుడిపై నీటి ఉనికిని 3 నుంచి 2 బిలియన్ సంవత్సరాల ముందు పరిస్థితిని వివరించింది.


Next Story