అమెరికా అంతరక్షి పరిశోధనా సంస్థ నాసా, ప్రైవేట్ స్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్ కలిసి రాకెట్ ప్రయోగం చేపట్టారు. ఫాల్కన్ 9 రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ 'క్రూ-3' మిషన్‌లో నలుగురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ బయల్దేరారు. ఇక మిషన్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తోంది భారత సంతతికి చెందిన రాజాచారి.. ఇంకా చెప్పాలంటే అతను తెలుగు వ్యక్తి. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్‌లో ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం జరిగింది. అమెరికా టైమ్ ప్రకారం.. బుధవారం రాత్రి 9 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
22 గంటల ప్రయాణం తర్వాత నలుగురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంటారు. ఈ మిషన్ స్పెషలిస్ట్‌గా అమెరికా నేవీ సబ్‌మెరైన్ అధికారి కేలా బారన్, పైలట్‌గా నాసాకు చెందిన టామ్ మార్ష్‌బర్న్, ఐరోపా స్పేస్ సంస్థకు చెందిన మత్తియాస్ మౌరర్ మిషన్ స్పెషలిస్టుగా అంతరిక్షంలోకి వెళ్లారు. వీరు ఐఎస్‌ఎస్‌లో 6 నెలల పాటు ఉండనున్నారు. ఈ ప్రయోగం రెండు వారాల కిందటే జరగాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆలస్యమైంది. 'క్రూ-3' మిషన్‌కు కమాండర్‌గా ఉన్న ఇండియన్ అమెరికన్ రాజాచారి అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో కర్నల్ హోదాలో ఉన్నారు.
రాజాచారి తండ్రి శ్రీనివాస్ వి.చారి ఉద్యోగం కోసం హైదరాబాద్ నుండి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే అమెరికా పౌరురాలు పెగ్గీ ఎగ్బర్ట్‌ను మ్యారేజ్ చేసుకున్నారు. 1977లో వారికి రాజాచారి జన్మించాడు. విస్కాన్సిన్‌లో మిల్వాకీలో ఫస్ట్ స్టాండర్ట్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన రాజాచారి.. ఆ తర్వాత ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఎంఐటీలో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందాడు. అమెరికా నావల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో చదవిని రాజాచారి.. 2017లో నాసా అస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్‌కు ఎంపికయ్యాడు. రాజాచారికి తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేస్తున్నాడు.