గుర్తు తెలియని వ్యాధి అక్కడ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఆ ప్రాణాంతక వ్యాధి కారణంగా 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వ్యాధి మొదట గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో కనుగొనబడింది. ఆ తర్వాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనదిగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లో చాలా మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం దీని ప్రారంభ లక్షణాలు కాగా.. పరిస్థితులను బట్టి ఈ వ్యాధి ఆందోళనకరంగా మారుతుంది.
అంతర్గత రక్తస్రావం లేదా రక్తస్రావ జ్వరం లక్షణాలు సాధారణంగా ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, ఎల్లో జ్వరం వంటివి కలిగించే ప్రాణాంతక వైరస్‌లతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే ఇప్పటివరకు సేకరించిన డజనుకు పైగా నమూనాల పరీక్షల ఆధారంగా పరిశోధకులు ఈ వైరస్‌లకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయనేది కనుగొనలేదు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి జనవరి 21న ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పటివరకు 419 కేసులు నమోదయ్యాయి. 53 మరణాలు సంభవించాయి.
ఈ మిస్టరీ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆఫ్రికా కార్యాలయం (WHO) బోలోకో గ్రామంలో ముగ్గురు పిల్లలు గబ్బిలాలు తిని 48 గంటల్లో మరణించడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని చెప్పారు.