విమానాశ్రయంపై డ్రోన్ దాడి

Multiple explosions rock Iraq's Erbil airport. ఇరాక్‌లోని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అనేక పేలుళ్లు సంభవించాయని

By Medi Samrat  Published on  12 Sep 2021 4:50 PM GMT
విమానాశ్రయంపై డ్రోన్ దాడి

ఇరాక్‌లోని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అనేక పేలుళ్లు సంభవించాయని పలు మీడియా సంస్థలు చెప్పాయి. భద్రతా సేవల నుండి వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం, పేలుళ్లు డ్రోన్ లేదా రాకెట్ దాడి వల్ల సంభవించాయా అనేది అస్పష్టంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ దాడులు జరిగాయి. శనివారం రాత్రి ఆలస్యంగా ఎర్బిల్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగిందని మీడియా సంస్థలు తెలిపాయి. ఎర్బిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్‌తో బాంబు దాడి జరిగింది. అయితే ఈ దాడిలో ఎవరికి ప్రమాదం జరగలేదని కుర్దిష్‌ భద్రతా దళాలు ప్రకటించాయి. అయితే ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదని తెలిపాయి. విమానాశ్రయం సమీపంలోనే అమెరికన్‌ కాన్సులేట్‌ ఉండటం గమనార్హం. పేలుళ్ల అనంతరం ఎయిర్‌పోర్టు దారులను మూసివేశారు.

విమానాశ్రయం సమీపంలో కనీసం మూడు పేలుళ్లు వినిపించాయని అధికారులు చెప్పారు. రెండు డ్రోన్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దాడి చేసిన డ్రోన్లలో ఒకటి కూలిపోయిందని, మరొకటి కాల్చివేయబడినట్లు సమాచారం. కుర్దిష్ మీడియా నివేదికల ప్రకారం, ఎర్బిల్‌లోని యుఎస్ కాన్సులేట్ వద్ద కూడా ఎమర్జెన్సీని విధించారు. శనివారం రాత్రి అర్బిల్‌ విమానాశ్రయం సమీపంలో రెండు సార్లు భారీ శబ్ధాలు వినిపించాయని, చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం నల్లని పొగలు కమ్ముకున్నాయని స్థానికులు వెల్లడించారు. సోషల్ మీడియాలో కూడా పలువురు వీడియోలను పోస్టు చేశారు.


Next Story