ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి

multi-vehicle crash on an Alabama highway. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ వారాంతంలో అలబామా హైవేపై కొన్ని వాహనాలు

By Medi Samrat  Published on  22 Jun 2021 4:37 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ వారాంతంలో అలబామా హైవేపై కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో టెనస్సీస్ కు చెందిన తండ్రి అతని కుమార్తె సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు.

న్యూ హోప్ టెనస్సీస్ కి చెందిన కోడి ఫాక్స్ (29), అతని 9 నెలల కుమార్తె చనిపోయారని ఆదివారం రాత్రి అలబామా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన ఇతర బాధితులు 3 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలని తెలుస్తోంది. ఆ పిల్లలంతా ఓ బస్సులో ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. అలబామాలోని క్యాంప్ హిల్‌కు నైరుతి దిశలో 120 మైళ్ల దూరంలో ఉన్న ఇంటర్ స్టేట్ 65 లో ఈ ప్రమాదం జరిగింది.

మోంట్‌గోమేరీకి నైరుతి దిశలో అలబామాలోని బట్లర్ కౌంటీ నివాస గృహానికి చెందిన వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ పిల్లలంతా మరణించారు. అలబామా షెరీఫ్స్ యూత్ రాంచెస్ చేత నిర్వహించబడుతున్న చిన్న బస్సులో ఈ పిల్లలు ప్రయాణం చేస్తున్నప్పుడు వరుసగా యాక్సిడెంట్లు చోటు చేసుకున్నాయి. అలబామాలోని పేదల పిల్లలైన వీరికి మంచి చదువు అందించాలనే ఉద్దేశ్యంతో ఓ హోమ్ కు తరలిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డజనుకు పైగా కార్లు ఇంటర్ స్టేట్ 65 పై యాక్సిడెంట్ కు గురయ్యాయి. ఆ తర్వాత మంటలు కూడా రావడంతో ప్రమాదం సంభవించిందని అధికారులు అనుమానిస్తున్నారు.

ఉష్ణమండల తుఫాను క్లాడెట్ కారణంగా ఆ ప్రాంతంలో భారీ వర్షం పడింది. ఆ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐ -65 నార్త్‌బౌండ్‌లో మైలు మార్కర్ 138 వద్ద జరిగిన ఈ సంఘటనలో రెండు వాణిజ్య వాహనాలతో సహా మొత్తం 17 వాహనాలు ప్రమాదానికి ఒకదాని తర్వాత మరొకటి గురయ్యాయి. కోడీ ఫాక్స్, అతడి కుమార్తె కూడా ఈ ప్రమాదంలో మరో వాహనంలో ఉండగా మరణించారు.


Next Story