కోతిని టాయ్ లెట్ లో వేసి ఫ్లష్ చేయాలని అనుకుంది..!

Mother Caught Trying Flush Pet Monkey Toilet Offering Cocaine Spared Jail. నలుగురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ తన పెంపుడు

By Medi Samrat  Published on  11 Dec 2021 1:52 PM GMT
కోతిని టాయ్ లెట్ లో వేసి ఫ్లష్ చేయాలని అనుకుంది..!

నలుగురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ తన పెంపుడు కోతిని టాయిలెట్‌లో ఫ్లష్ చేయడానికి ప్రయత్నించింది. అంతే కాకుండా ఆ కోతికి కొకైన్ అందించింది కూడా. విక్కీ హాలండ్ అనే మహిళ తన పెంపుడు కోతికి ఎంత టార్చర్ చూపించాలో చూపించింది. 38 సంవత్సరాల ఆ మహిళ కోతిని ఎంతగానో ఇబ్బందులు పెడుతూ 22 వీడియోలను రూపొందించింది. ఒక టాయిలెట్ బౌల్‌లో కోతి గోకుతూ ఉండగా.. విక్కీ హాలండ్ హాలండ్ దానిని ఫ్లష్ చేయబోతున్నట్లు చెప్పడం కూడా వీడియోలో రికార్డు చేసింది.

ఆమెకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని తెలిసి న్యూపోర్ట్‌లోని ఆమె ఇంటిపై పోలీసులు రైడ్ చేసినప్పుడు మాత్రమే జంతువు యొక్క దుస్థితి గురించి అధికారులకు తెలిసింది. వారు ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హాలండ్ జంతువుతో అసభ్యంగా ప్రవర్తించే 'చాలా కలవరపెట్టే' వీడియోలను చూసారు. 'కొంచెం కోక్(కొకైన్) కావాలా? నా వేళ్లను నొక్కు' అంటూ కోతితో మాట్లాడుతూ ఉన్నారు. కొకైన్ రవాణాపై గత ఏడాది నవంబర్‌లో ఆమె పట్టుబడింది. మేలో కోర్టుకు హాజరైన ఆమె £4,000 చెల్లించాలని జడ్జి ఆదేశించారు. ఇక ఆమె ఎటువంటి జంతువులను కూడా జీవితాంతం ఉంచుకోకుండా నిషేధించబడింది. 12 వారాల జైలు శిక్ష విధించబడింది. ప్రస్తుతం కోతికి చికిత్సను అందిస్తూ ఉన్నారు. ఆమె దగ్గరే ఉండి ఉంటే కోతి పరిస్థితి తలచుకుంటేనే షాకింగ్ గా అనిపిస్తోందని వెటర్నరీ వైద్యులు తెలిపారు.


Next Story