తండ్రి మృతదేహం పక్క‌న మోడ‌ల్ ఫోటోషూట్.. నవ్వులు ఏంది అంటూ..

Model jayne rivera photoshoot at father funeral photos viral. సెల్ఫీ పిచ్చి ఉండాలి.. కానీ మరి ఇంతలా ఉండకూడదు. ట్రెండ్‌ కావడం కోసం మరీ ఇంతలా సెల్ఫీలు దిగాల్సిన అవసరం

By అంజి  Published on  28 Oct 2021 12:10 PM GMT
తండ్రి మృతదేహం పక్క‌న మోడ‌ల్ ఫోటోషూట్.. నవ్వులు ఏంది అంటూ..

సెల్ఫీ పిచ్చి ఉండాలి.. కానీ మరి ఇంతలా ఉండకూడదు. ట్రెండ్‌ కావడం కోసం మరీ ఇంతలా సెల్ఫీలు దిగాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ మోడల్‌ చేసిన పనికి.. ఆమెపై అందరూ విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన పనేంటి అంటే.. తన తండ్రి మృతదేహం పక్కన ఫొటో షూట్‌ చేసింది. ఈ ఘటన యూఎస్‌లోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. మోడల్‌ జైనె రివెరాకు సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్స్‌ ఉన్నాయి. తను చేసే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పూడు జైనె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. పర్సనల్‌ విషయాల నుంచి అఫిషీయల్‌ విషయాల వరకు అన్ని కూడా అభిమానులతో చెప్పుకుంటూ ఉంటుంది. ఇందుకునేమో ఈమెకు కొట్ల మంది అభిమానులు ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆమె తాజాగా తన తండ్రి చనిపోయిన సందర్భంగా.. తండ్రి మృతదేహం పక్కన సెల్పీ ఫోటోషూట్‌ చేసింది. తండ్రి మృతదేహం పక్కన నవ్వుతూ దిగిన ఫొటోలో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. దీంతో ఈమె చేసిన పనికి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి చనిపోతే నువ్వు చేసే పని ఇదేనా, నీకు బుద్దుందా, ఈ ఫొటోషూట్‌లు ఏంటి ఆమెపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీంతో వెంటనే జైనె రివెరా.. ఆ పోస్టును డిలీట్‌ చేసింది. అప్పటికే కొంత మంది ఆ ఫొటోలను స్క్రీన్‌ షాట్లు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. జైనె రివెరా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గ మారాయి.


Next Story