బ్రెజిల్ మోడల్ ను చంపిన రష్యా

model from Brazil killed in Russian military strike fighting for Ukraine. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు.

By Medi Samrat  Published on  6 July 2022 5:02 PM IST
బ్రెజిల్ మోడల్ ను చంపిన రష్యా

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు. ఎంతో మంది సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా దాడిలో ఓ బ్రెజిల్ మోడల్ చనిపోయింది. 39 ఏళ్ల బ్రెజిల్ మోడల్ తలిత వాల్లె కూడా మరణించింది. ఖర్కీవ్ నగరంపై జరిగిన దాడిలో జూన్ 30న ఆమె మరణించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. లా చదివిన తలిత కొన్నాళ్లు మోడల్‌గా, నటిగా పనిచేసింది. ఎన్జీవోలతో కలిసి అనేక మానవతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. తర్వాత ఇరాక్‌లోని కుర్దిస్తాన్ డిమాండుతో ఏర్పడిన సాయుధ దళంలో పనిచేసింది. అక్కడే స్నైపర్ షూటింగులో ప్రావీణ్యం సంపాదించింది. యుద్ధంలో తనకు ఎదురైన అనుభవాలను వీడియోలు రూపొందించి వాటిని యూట్యూబులో పెట్టింది.

రష్యన్ బలగాలు సమీపిస్తున్నాయని, ఫోనులో మాట్లాడితే శత్రువు డ్రోన్లకు దొరికిపోయే ప్రమాదం ఉండడంతో కనీసం ఫోనులో కూడా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె ప్రాణాలు కోల్పోయిందనే వార్తను ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మోడల్ అయినప్పటికీ ఉక్రేనియన్ దళాలలో స్నైపర్ గా చేరింది. న్యాయశాస్త్రం అభ్యసించిన తలిత వార్‌జోన్‌లలో తన అనుభవాన్ని యూట్యూబ్‌లో డాక్యుమెంట్ చేసింది. ఈ మోడల్ గతంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా బాంబు దాడిలో బయటపడింది.











Next Story