న్యూ హాంప్‌షైర్‌లోని పర్వత మార్గంలో అదృశ్యమైన 19 ఏళ్ల హైకర్ చనిపోయిందని అధికారులు తెలిపారు. ఎమిలీ సోటెలో 20 ఏళ్లు నిండకముందే యునైటెడ్ స్టేట్స్‌లోని మొత్తం 48 శిఖరాలను అధిరోహించాలనే తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఆమె గత ఆదివారం ఒంటరిగా హైకింగ్ కు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె మృతదేహం న్యూ హాంప్‌షైర్‌లోని మౌంట్ లఫాయెట్ వద్ద గుర్తించారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలో మూడు రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఎమిలీ సోటెలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె కోరుకున్న లక్ష్యాలను చేధించే క్రమంలో దురదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలను కోల్పోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని తీసుకుని వచ్చే సమయంలో కూడా ఎముకలు కొరికే ఉష్ణోగ్రతలు, అధిక గాలులు ఇబ్బందులు పెట్టాయని రెస్క్యూ టీమ్ తెలిపింది.
"ఒక NH ఆర్మీ నేషనల్ గార్డ్ హెలికాప్టర్ ఎమిలీని కానన్ మృతదేహాన్ని మౌంటైన్ స్కీ ప్రాంతానికి తీసుకుని రావడానికి సహాయపడింది" అని అధికారులు తెలిపారు. సోటెలో ఆదివారం స్వయంగా ఫ్రాంకోనియా రిడ్జ్ వెంబడి హైకింగ్ కు వెళ్లి తిరిగి రాలేదని అధికారులు తెలిపారు. సోటెలో వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, అక్కడ ఆమె బయోకెమిస్ట్రీ, కెమికల్ బయాలజీ చదువుతోంది.