పాకిస్తాన్ లో మహిళా టిక్ టాకర్ పై అత్యంత దారుణం

Minar-e-Pakistan incident. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్స‌వం (ఆగ‌స్ట్ 14) రోజున లాహోర్‌లో దారుణం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  18 Aug 2021 2:11 PM GMT
పాకిస్తాన్ లో మహిళా టిక్ టాకర్ పై అత్యంత దారుణం

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్స‌వం (ఆగ‌స్ట్ 14) రోజున లాహోర్‌లో దారుణం చోటు చేసుకుంది. టిక్‌టాక్ వీడియోలు చేసే ఓ మ‌హిళ‌పై ఒకేసారి వంద‌ల మంది దాడి చేశారు. ఆమె బ‌ట్ట‌లు చించేసి.. గాల్లోకి ఎగ‌రేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్వాతంత్ర్య దినోవ్సం రోజున పార్క్‌లో వంద‌ల మంది పురుషులు త‌న‌ను చుట్టుముట్టి దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆ మ‌హిళ వెల్ల‌డించింది. ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ దారుణ‌మైన ఘ‌ట‌న గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది. ఈ ఘ‌ట‌న‌పై లారీ అడ్డా పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసిన‌ట్లు పాక్ ప‌త్రిక డాన్ వెల్ల‌డించింది. మినారె పాకిస్థాన్ ద‌గ్గ‌ర త‌న‌తోపాటు త‌న ఆరుగురు స్నేహితుల‌తో వీడియో తీస్తున్న స‌మ‌యంలో 300 నుంచి 400 మంది త‌మ‌పై దాడి చేసిన‌ట్లు మహిళ త‌న ఫిర్యాదులో తెలిపింది. తాము త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింద‌ని.. త‌న దుస్తులు చించి, గాల్లోకి ఎగ‌రేసి దారుణంగా హింసించార‌ని ఆమె తెలిపింది.

లాహోర్ లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్ లో తన ఐదుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తున్న మహిళా టిక్ టాకర్ ను అల్లరి మూక ఏడిపించింది.. కాదు కాదు హింసించింది. ఆ అమ్మాయిపై 400 మంది అకృత్యాలకు పాల్పడ్డారు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. బట్టలు చించేశారు. గాల్లోకి విసిరేసి వికృతానందం పొందారు. నడి బజార్ లో ఆ అమ్మాయిని బట్టల్లేకుండా నడిపించారు. అంతేకాదు.. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచేశారు. సెల్ ఫోన్ ను లాక్కున్నారు. డబ్బులను దొంగిలించారు. ఆ బాధాకరమైన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story