మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మిలటరీ విమానం కుప్పకూలిన ఘటనలో 12 మంది మరణించారు. ప్రమాదం నుండి విమాన పైలట్‌తో పాటు ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాళ్లోకెళితే.. మయన్మార్ రాజధాని నేపిడా నుంచి విమానం పియన్‌వూ ల్విన్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో ఆకాశంలో అదుపుతప్పిన విమానం మాండలే నగరంలో స్టీల్ ప్లాంట్ సమీపంలో కుప్పకూలింది.
దాదాపు 984 ఫీట్ల ఎత్తు నుంచి కిందపడిపోయినట్లు మిలటరీ నేతృత్వంలోని వార్తాసంస్థ పేర్కొంది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు పలువురు సాధువులు ఉన్నారు. వారంతా ఓ భౌద్ద మఠానికి వెళ్లాల్సి ఉందని.. అంతలోనే ఈ ఘోరం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. వాతావరణం సరిగా లేకపోవడం కారణంగానే పన్రమాదం జరిగిందని అంటున్నా.. వివరాలు తెలియాల్సివుంది. గతంలోనూ మయన్మార్‌లో చాలా విమాన ప్రమాదాలు జరిగాయి.