సముద్రంలో కూలిన మిగ్-29కే విమానం..!
MiG-29K aircraft crashes into Arabian Sea. భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం గురువారం సాయంత్రం అరేబియా
By Medi Samrat Published on 27 Nov 2020 5:18 AM GMT
భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం గురువారం సాయంత్రం అరేబియా సముద్రంలో కూలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సముద్రంలో పడిపోయారు. అందులో ఒకరి ఆచూకీ లభించగా.. మరొకరు తప్పిపోయారు. తప్పిపోయిన పైలట్ కోసం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించామని నేవీ అధికారులు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయమై విచారణకు ఆదేశించామని తెలిపారు. కనిపించకుండా పోయిన పైలట్ కోసం వాయుసేనతో పాటు సైన్యం సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు.
A MiG-29K trainer ac operaring over sea reported ditched at about 1700h/ 26 Nov 20. One pilot recovered. SAR (Search & Rescue) operation in progress to look for the 2nd pilot. #IN has instituted an inquiry to look into cause of accident @indiannavy (rep pic) pic.twitter.com/LKxOyKmTRL
— Captain DK Sharma (@CaptDKS) November 27, 2020
రోజువారీ శిక్షణలో భాగంగా దక్షిణ గోవాలోని ఐఎన్‌ఎస్ హన్సా నుంచి బయల్దేరిన మిగ్-29కే విమానం నిన్న సాయంత్రం 5 గంటలకు అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఏడాది మిగ్-29కే విమానం కుప్పకూలడం ఇది మూడోసారి. గత ఫిబ్రవరిలో గోవా తీరంలో మిగ్-29 కే శిక్షణ విమానం ఉదయం 10.30 గంటలకు కూలిపోయింది. అయితే అందులో ఉన్న పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.