అడల్ట్ స్టార్ మియా ఖలీఫా చనిపోయిందని సోషల్ మీడియా పోస్టులు.. అస‌లేం జ‌రిగిందంటే..

Mia Khalifa Denies Death Rumours With Meme After Facebook Page Turns Memorial. అడల్ట్ స్టార్ మియా ఖలీఫా చనిపోయిందనే సోషల్ మీడియా పోస్టులు చూసి ఆమె

By Medi Samrat  Published on  31 Jan 2022 11:46 AM GMT
అడల్ట్ స్టార్ మియా ఖలీఫా చనిపోయిందని సోషల్ మీడియా పోస్టులు.. అస‌లేం జ‌రిగిందంటే..

అడల్ట్ స్టార్ మియా ఖలీఫా చనిపోయిందనే సోషల్ మీడియా పోస్టులు చూసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఆమె మరణ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. మియాకు ఏమి జరిగిందో ఎవరికీ క్లారిటీ లేకపోవడంతో ఆమె చనిపోయిందనే వార్తపై నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే ఇది కేవలం పుకారు మాత్రమేనని తేలింది. మియా ఖలీఫా ఈ వార్తలని పుకారు అని చెప్పడమే కాకుండా.. పూర్తిగా క్షేమంగా ఉన్నానని తెలిపింది. దీంతో ఆమె అభిమానులు ఉపశమనం పొందారు.

ఇటీవల మియా ఖలీఫా ఫేస్‌బుక్ పేజీని మెమోరియల్ పేజీగా మార్చారు. పేజీ శీర్షిక 'రిమెంబరింగ్ మియా ఖలీఫా' అని వ్రాయబడింది. అంతేకాదు ఆమె ప్రొఫైల్ ఫోటో కూడా డిలీట్ అయింది. ఇదంతా జరిగిన తర్వాత ఆమె చనిపోయిందని పలువురు ఊహించుకున్నారు. అయితే మియా ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందా.. లేక మరేదైనా కారణం వల్ల జరిగిందా అనే విషయంపై స్పష్టత రాలేదు.ఈ వార్తపై అడల్ట్ స్టార్ మౌనం వీడారు. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని ఆమె ట్వీట్ చేసింది. నిన్న, మియా తన మరణ వార్త తప్పని, తనకు ఏమీ జరగలేదని చెబుతూ, క్లాసిక్ చిత్రం మాంటీ పైథాన్ అండ్ ది హోలీ గ్రెయిల్‌కి సంబంధించిన మీమ్ ను షేర్ చేసింది.

మియా ట్వీట్ బయటకు రాగానే ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మోడల్ ఫేస్‌బుక్ పేజీని మెమోరియల్ పేజీగా మార్చిన తర్వాత ఆమె పోస్ట్‌లన్నీ అదృశ్యమయ్యాయి. మియా మరణ వార్త వైరల్‌గా మారడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2020లో, అడల్ట్ స్టార్ మరణ వార్త కూడా సోషల్ మీడియాలో నివేదించబడింది. అప్పట్లో ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ పోస్టులు పెట్టారు. ఆ తర్వాత అవి ఫేక్ న్యూస్ అని తేలింది.


Next Story