ఎవరీ ఆకాశ్ బొబ్బ.? ఎలాన్ మస్క్ టీమ్‌లో భారత సంతతి యువ ఇంజనీర్
టెస్లా CEO ప్రస్తుతం US డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి అధిపతిగా పనిచేస్తున్నారు.
By Medi Samrat Published on 4 Feb 2025 5:25 PM IST
టెస్లా CEO ప్రస్తుతం US డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి అధిపతిగా పనిచేస్తున్నారు. ఎలోన్ మస్క్ ఆరుగురు యువ ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ప్రభుత్వ సమర్థత విభాగంలో (DOGE) కీలక స్థానాలకు నియమించారు. వైర్డ్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మస్క్ నియమించుకున్న ఇంజనీర్లలో కొందరు ఇటీవలే కళాశాల విద్య అభ్యసించి పట్టభద్రులయ్యారు. మస్క్ జట్టులో ఎడ్వర్డ్ కొరిస్టిన్, ల్యూక్ ఫారిటోర్, గౌటియర్ కోల్ కిలియన్, గావిన్ క్లిగర్, ఏతాన్ షాత్రాన్ ఉన్నారు. ఈ ఇంజనీర్లందరి వయస్సు 19 నుండి 24 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీరిలో కొందరు ఇప్పుడే కళాశాల విద్య ద్వారా పట్టభద్రులయ్యారని, ఒకరు ఇప్పటికీ విద్యార్థి అని నివేదించబడింది. వీరిలో భారతీయ సంతతికి చెందిన ఆకాష్ బొబ్బా కూడా ఉన్నారు.
ఈ ఇంజనీర్లు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (OPM), జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (GSA) వంటి అనేక ముఖ్యమైన పోస్ట్‌లలో నియమించబడ్డారు. ఇక్కడ ఈ ఇంజనీర్‌లు సున్నితమైన ప్రభుత్వ డేటాపై విధులు నిర్వర్తించనున్నారు. ఈ ఇంజనీర్ల నియామకంపై కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవహారాలలో అనుభవం లేకపోవడం.. ముఖ్యమైన డేటాను నిర్వహించడం సమస్యలను సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు
ఆకాష్ బొబ్బా ఎవరో తెలుసా.?
NDTVలోని ఒక వార్త ప్రకారం.. భారతీయ సంతతికి చెందిన ఆకాష్ బొబ్బా.. బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఆకాష్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ టెక్నాలజీ (MET) ప్రోగ్రామ్‌లో భాగం. DOGEలో భాగం కావడానికి ముందు 22 ఏళ్ల ఆకాష్ బొబ్బా.. పలంటిర్ మరియు హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లో శిక్షణ పొందాడు. మెటా సంస్థలో ఇంటర్న్‌గా పనిచేశాడు. ఇక్కడ అతను AI, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ మోడలింగ్‌లో కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఆకాష్ బొబ్బా OPMలో స్పెషలిస్ట్. DOGE కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్, xAI, Uberలో టాలెంట్ అక్విజిషన్ మాజీ హెడ్ అయిన అమండా స్కేల్స్‌కు నేరుగా నివేదించనున్నాడు. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో అతను నిపుణుడని సమాచారం.