93 ఏళ్ల వ‌య‌సులో ఐదో పెళ్లి చేసుకున్న మీడియా టైకూన్‌

ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా టైకూన్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ ముర్డోక్ 93 ఏళ్ల వ‌య‌సులో తన రష్యా స్నేహితురాలు ఎలెనా జుకోవాను వివాహం చేసుకున్నారు

By Medi Samrat  Published on  3 Jun 2024 10:03 AM
93 ఏళ్ల వ‌య‌సులో ఐదో పెళ్లి చేసుకున్న మీడియా టైకూన్‌

ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా టైకూన్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ ముర్డోక్ 93 ఏళ్ల వ‌య‌సులో తన రష్యా స్నేహితురాలు ఎలెనా జుకోవాను వివాహం చేసుకున్నారు. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆయ‌న‌ ఐదవసారి వరుడు అయ్యారు. శనివారం మర్డోక్ వైన్యార్డ్‌లో వివాహం జరిగింది. గత ఏడాది నుంచి ఈ జంట ఒకరితో ఒకరు డేటింగ్‌లో ఉన్నారు. ముర్డోక్ తన మూడవ భార్య వెండి డెంగ్ ద్వారా ఎలెనాను కలిశాడు.

93 ఏళ్ల ముర్డోక్, 67 ఏళ్ల ఎలెనా శనివారం వివాహ ప్రమాణాలు చేశారు. ఇందుకు సంబంధించిన‌ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలెనా తెల్లని గౌనులో.. చేతుల్లో తెల్లటి పూల బొకేతో కనిపిస్తుంది. ముర్డోక్ స్నీకర్లతో బ్తాక్‌ సూట్ ధరించాడు.

వివాహ వేడుకకు న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రాబర్ట్ కె. క్రాఫ్ట్, న్యూస్ కార్ప్ CEO రాబర్ట్ థామ్సన్ కూడా హాజరయ్యారు. NYT ప్రకారం.. ఎలెనా 1991లో మాస్కో నుండి USకి వలస వచ్చింది. ఆమె పదవీ విరమణ పొందిన మాలిక్యులర్ బయాలజిస్ట్. అంతకుముందు ఆమె బిలియనీర్ ఎనర్జీ ఇన్వెస్టర్ అలెగ్జాండర్ జుకోవ్‌ను వివాహం చేసుకుంది.

రూపెర్ట్ మర్డోచ్ 1956లో ప్యాట్రిసియా బుకర్‌ను వివాహం చేసుకున్నాడు. 1967లో పదకొండు సంవత్సరాల తర్వాత ఈ జంట విడిపోయారు. వీరికి ఒక పాప ఉంది. అదే సంవత్సరం.. ముర్డోక్ తన రెండవ భార్య అన్నా మరియా టోర్వ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ ముగ్గురు పిల్లలు. మూడు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత 1999లో విడాకులు తీసుకున్నారు. ఆమె అదే సంవత్సరం డెంగ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరు 2013లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటి, మోడల్ జెర్రీ హాల్‌తో ముర్డోక్ నాల్గవ వివాహం చేసుకోగా.. ఆరు సంవత్సరాల తర్వాత 2022లో విడాకులు తీసుకున్నారు.

Next Story