మక్కాలో భారీ వర్షం కురిసింది. వరదలు కూడా వచ్చాయి. వరద నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. రోడ్డు మధ్యలో బస్సులు నిలిచిపోయాయి. సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) నివేదిక ప్రకారం మక్కా నగరంలో భారీగా వరద నీరు చేరుకుంది. జెడ్డా నగరంతో సహా దాని పరిసర ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. సౌదీ అరేబియాలోని మక్కా మదీనా చుట్టూ ఉరుములు, భారీ వర్షాలు, వడగళ్ళు కురిశాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు ఆపరేషన్లు జరుగుతున్నాయి.
ఈ వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మక్కాకు ఆగ్నేయంగా ఉన్న అల్-అవాలి ప్రాంతంలో చిక్కుకున్న పిల్లలను రక్షించేందుకు పలువురు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. సౌదీ అరేబియా వాతావరణ శాఖ మక్కా, మదీనా, జెడ్డా నగరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.