మాల్దీవుల రాజధాని మాలేలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. అందులో 11 మంది మరణించారు. విదేశీ కార్మికులు నివసించే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో కనీసం 11 మంది మరణించారు. పలువురు గాయపడినట్లు అగ్నిమాపక బృందం తెలిపింది. అగ్నిప్రమాదంలో ధ్వంసమైన భవనం పై అంతస్తు నుండి అధికారులు 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్ లోని వాహనాల రిపేర్ గ్యారేజీ నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలను ఆర్పడానికి నాలుగు గంటల సమయం పట్టిందని అక్కడ అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదంలో మరణించిన మరో వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడని ఆ దేశ భద్రతా అధికారి తెలిపారు. అక్కడ పని చేసే చాలా మంది పని వాళ్లలో ఎక్కువగా బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంకలకు చెందినవారే..! ఎంతో మంది ఉపాధి కోసం ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన మాల్దీవులకు వెళుతూ ఉన్నారు.