లివర్‌పూల్‌ ఆస్పత్రి వద్ద భారీ పేలుడు.. క్యాబ్‌ డ్రైవర్‌ సాహసం

Massive explosion at Liverpool hospital. ఆ సూసైడ్‌ బాంబర్‌.. రిమెంబరెన్స్‌ డే సర్వీసు వద్ద మారణ హోమం సృష్టించాలనుకున్నాడు. కానీ ఓ ట్యాక్సీ డ్రైవర్‌ వ్యవహరించడంతో

By అంజి  Published on  15 Nov 2021 9:15 AM GMT
లివర్‌పూల్‌ ఆస్పత్రి వద్ద భారీ పేలుడు..  క్యాబ్‌ డ్రైవర్‌ సాహసం

ఆ సూసైడ్‌ బాంబర్‌.. రిమెంబరెన్స్‌ డే సర్వీసు వద్ద మారణ హోమం సృష్టించాలనుకున్నాడు. కానీ ఓ ట్యాక్సీ డ్రైవర్‌ వ్యవహరించడంతో అతని ఆట కట్టినట్లైంది. ఉగ్రవాదిని కారులోనే బంధించిన డ్రైవర్‌.. దానికి లాక్‌ వేశాడు. దీంతో సూసైడ్‌ బాంబర్‌ కారులో తనకు తానే పేల్చుకున్నాడు. లేదంటే చాలా మంది ప్రాణాలు పోయేవి. ఈ ఘటన లివర్‌పూల్‌ నగరంలోని మెటర్నటీ ఆస్పత్రి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ సూసైడ్‌ బాంబర్‌ రిమెంబరెన్స్‌ డే సర్వీసు వద్ద ఉగ్రదాడికి పాల్పడాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన శరీరానికి పేలుడు పదార్థాలను అమర్చుకున్నాడు. ఆ తర్వాత లివర్‌పూల్‌ వెళ్లేందుకు క్యాబ్‌ ఎక్కాడు. వెళ్లే దారిలో క్యాబ్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో క్యాబ్‌ను డ్రైవర్‌ లివర్‌పూల్‌ మెటర్నటీ ఆస్పత్రి వైపుకు డైవర్ట్‌ చేశాడు.

ఈ క్రమంలోనే కారులో కూర్చున్న వ్యక్తి కదలికలు డ్రైవర్‌కు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో అతడిని ఓ కంట కనిపెడుతూనే డ్రైవర్‌ ముందుకు సాగాడు. ఆస్పత్రి దగ్గరకు చేరుకునే లోపే అతడు ఓ సూసైడ్‌ బాంబర్‌ అని క్యాబ్‌ డ్రైవర్‌ అర్థం అయ్యింది. వెంటనే స్లో చేసి కారు దిగిన డ్రైవర్‌.. వెంటనే బాంబర్‌ని క్యాబ్‌లోనే ఉంచి లాక్‌ చేశాడు. దీంతో సూసైడ్‌ బాంబర్‌ తనను తాను కారులో పేల్చుకున్నాడు. ఈ ఘటనలో బాంబర్‌ మృతి చెందాడు. మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్యాబ్‌ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. టాక్సీ డ్రైవర్‌ చేసిన సాహసానికి అక్కడి ప్రజలు అతడిని మెచ్చుకుంటున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌ నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.

Next Story