సీక్రెట్ ఎఫైర్ కోసం సొరంగం తవ్వాడు.. !

Married Man Builds Secret Tunnel to his Lovers House Busted by her Husband. ఇటీవ‌ల కాలంలో వివాహేత‌ర సంబంధాలు అధికం

By Medi Samrat  Published on  31 Dec 2020 11:05 AM GMT
సీక్రెట్ ఎఫైర్ కోసం సొరంగం తవ్వాడు.. !

ఇటీవ‌ల కాలంలో వివాహేత‌ర సంబంధాలు అధికం అవుతున్నాయి. వివాహేత‌ర సంబంధాల కోసం మ‌నుషులు ఎంత వ‌ర‌కు పోతారే తెలిపే ఘ‌ట‌న ఇది. ఇంట్లో ఉన్న ఇల్లాలికి తెలియకుండా.. పొరుగింట్లో ఉన్న ప్రియురాలి భర్తకు కనిపించకుండా ఓ ఘటికుడు రెండు ఇళ్ల మధ్య సొరంగం తవ్వాడు. దీంతో ఇద్ద‌రూ త‌మ జీవిత భాగ‌స్వాముల‌కు తెలియ‌కుండా వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ ఘ‌ట‌న మెక్సికోలో జరిగింది. ప్ర‌స్తుతం ఈ సొరంగానికి సంబంధించిన చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

అల్బర్టో అనే వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడిగా ప‌నిచేస్తున్నాడు. తన పొరుగున ఉండే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. బ‌య‌ట నుంచి వెళితే.. త‌మ సంబంధం గురించి అంద‌రికి తెలిసిపోతుంద‌ని భావించాడు. దీంతో ఏకంగా త‌న ఇంట్లో నుంచి వివాహిత బెడ్‌రూమ్‌లోకి ఏకంగా సొరంగాన్ని తవ్వాడు. ఆ ప్రియురాలి భర్త సెక్యూరిటీ గార్డ్. దీంతో అత‌డు నైట్ డ్యూటీల‌కు వెళ్లిన స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లిసి ఏకాంతంగా క‌లుసుకునేవారు.

అయితే.. ఒకరోజు డ్యూటీ నుంచి ఆమె భర్త త్వరగా ఇంటికి రావడంతో వారి బండారం బయటపడింది. ఇంటికి వ‌చ్చిన భ‌ర్త‌కు పడక గదిలో ఏదో అలికిడి వినిపించింది. అనుమానంతో బెడ్డు కింద తొంగి చూసిన భర్తకు అల్బర్టో నక్కి ఉండడం కనిపించాడు. కానీ.. క్షణాల వ్యవధిలోనే అతడు అక్కడి నుంచి మాయం అయ్యాడు. దాంతో బెడ్డు కింద పరిశీలించి చూసిన భర్తకు ఓ రంధ్రం కనిపించింది. దానిపై కప్పి ఉంచిన తెరను తెరిచి చూస్తే సొరంగ మార్గం ద్వారం దర్శనమిచ్చింది. ఈ సొరంగం ఎక్క‌డికి వెలుతుందా అని.. దాని గుండా వెళ్లాడు. స‌రిగ్గా అది అల్బర్టో బెడ్ రూంకు తీసుకెళ్లింది.

తన తప్పును ఒప్పుకున్న అల్బర్టో తన భార్యకు ఈ విషయాన్ని చెప్పొద్దని బతిమాలాడు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న మహిళ భర్త అల్బర్టోను చితకబాదాడు. ఇద్దరు ఘర్షణ పడడం చూసి స్థానికులు గుమిగూడారు. దీంతో విషయం కాస్తా పోలీసులకు వరకు వెళ్లింది. తన భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అల్బర్టోపై భర్త ఫిర్యాదు చేశాడు. ఈ విషయం వార్తలోకి ఎక్కడం.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం జ‌రిగాయి


Next Story