బుధవారం నాడు ఫేస్ మాస్క్‌గా మహిళల లోదుస్తు (థంగ్)ను మాస్కుగా ధరించి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలోకి ఎక్కినందుకు ఒక యూఎస్ వ్యక్తిని ఫ్లోరిడాలో దింపేశారు. 38 ఏళ్ల ఆడమ్ జెన్నె.. మహిళల లోదుస్తును మాస్కుగా ధరించి విమానం ఎక్కాడు. కాగా విమానంలోని ప్రయాణికులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా అని సిబ్బంది చెక్ చేస్తుండగా.. ఆడమ్ జెన్నె మహిళల ఎరుపు రంగు గల లోదుస్తును మాస్కుగా ధరించి కనిపించాడు. అయితే సిబ్బంది దాన్ని తొలగించి మాస్కు ధరించాలని కోరారు. అందుకు అతడు నో చెప్పాడు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ తర్వాత ఈఘటనపై అతడు చెప్పిన సమాధానం విని అందరూ ఖంగుతిన్నారు. ఈ ఘటన ఫోర్ట్ లాడర్‌డేల్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానంలో తినడానికి, తాగేటప్పుడు కూడా మాస్క్‌లు ధరించాలని బలవంతం చేస్తున్నారని, అందుకే ఈ విధంగా చేశానని పేర్కొన్నారు. ఈ అసంబద్ధతను వివరించడానికి ఉత్తమ మార్గం ఇదేనని తాను భావించానని జెన్నె అన్నారు. మరొక ప్రయాణికుడు చిత్రీకరించిన సంఘటన వీడియోలో ఫ్లైట్ సిబ్బంది తన ముఖంపై మహిళల లోదుస్తును ఉంచితే విమానం ఎక్కేందుకు అనుమతి లేదని జెన్నీకి చెప్పడం చూపిస్తుంది.
పరస్పర చర్య సమయంలో అతని ముక్కు, నోరు లోదుస్తులతో కప్పబడి ఉంటుంది. కొంత చర్చ తర్వాత ఆయన తన సీటులోంచి లేచారు. విమానం నుంచి అతడిని దించిన తర్వాత.. అతడిపై విమానయాన సంస్థ నిషేధం విధించింది. జెన్నె మాట్లాడుతూ.. చాలా మంది ప్రయాణీకులు తనను బలవంతంగా ఫ్లైట్ నుండి దింపిన తర్వాత, మద్దతుగా విమానం నుండి వెళ్లిపోయారని చెప్పారు.