వీర్యం నింపిన సిరంజితో మహిళను గుచ్చాడు.. ఏ శిక్ష విధించారంటే..

Man Stabbed Woman Syringe SEMEN Gets Ten Years Prison. వీర్యం నింపిన సిరంజితో మహిళను గుచ్చాడు ఆ వ్యక్తి. దీంతో అతడికి ఏకంగా

By Medi Samrat  Published on  10 Sep 2021 6:19 AM GMT
వీర్యం నింపిన సిరంజితో మహిళను గుచ్చాడు.. ఏ శిక్ష విధించారంటే..

వీర్యం నింపిన సిరంజితో మహిళను గుచ్చాడు ఆ వ్యక్తి. దీంతో అతడికి ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది అమెరికా న్యాయస్థానం. అయితే ఆ శిక్షను కాస్తా పదేళ్లకు తగ్గించింది. ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్ (52) ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇలాంటి పనికి పాల్పడ్డాడు. కిరాణా దుకాణంలోకి వచ్చిన ఓ మహిళకు స్టీమెన్ వెనక నుంచి సిరంజిని గుచ్చాడు. ఆమెకు చురుక్కుమనడంతో ఏదో కుట్టిందని భావించిన బాధిత మహిళ నిందితుడిని ప్రశ్నించింది. దీనికి అతడు సిగరెట్‌తో కాల్చినట్టు చెప్పాడు. పురుగు కుట్టినట్టు ఉంటుందని నిందితుడు చెప్పినట్టు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

ఆ తర్వాత విచారణలో అతడు వీర్యం నింపిన సిరంజితో దాడి చేసినట్టు తేలింది. అంతేకాదు, మరో ఇద్దరు మహిళలపైనా స్టీమెన్ ఇలానే దాడికి యత్నించినట్టు పోలీసులు గుర్తించారు. తన ముందు నడుస్తున్న 17 ఏళ్ల యువతిపై వీర్యం చల్లినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. స్టీమెన్ ఇంటిని ఇక పోలీసులు పరిశీలించగా.. ద్రవంతో కూడిన ఓ సిరంజిని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా 9 సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్టీమెన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం తొలుత అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఈ శిక్షను పదేళ్లకు కుదిస్తూ తుదితీర్పు వెలువరించింది.


Next Story